అసలు ఈ సీక్వెల్ లో హీరోయిన్ ఎవరు..?

యువ నటుడు నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కార్తికేయ’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ చక్కటి విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత దీనికి సీక్వెల్ ఉంటుంది అని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి నానుతూ పోయినేడాది లాక్డౌన్ కి ముందు సీక్వెల్ ప్రకటితమై కరోన కారణంగా పట్టాలెక్కలేదు.

అయితే లాక్డౌన్ కి ముందే ఈ చిత్రం ఓ వారం రోజుల షెడ్యూల్ ను జరుపుకుందని చిత్ర వర్గాల సమాచారం. అయితే చిత్ర బృందం నుండి ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. కాగా ఈ చిత్రంలో అసలు హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించిన స్వాతి పెళ్ళి చేసుకుని సినిమాలకి దూరంగా ఉంటోంది. ఇక మొదటగా ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమను ఎంచుకున్నారని, కొన్ని కారాణాల వల్ల ఆమె తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె స్థానంలో ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక ఆరుళ్ మోహన్ ను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటె కార్తికేయలో హీరోయిన్ గా నటించిన కలర్స్ స్వాతి ఇందులో కూడా ఉంటె బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆమెను ఇందులో నటింప చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేసిందని, చివరికి దర్శకుడు స్వయంగా ఒప్పించడంతో ఆమె ఇందులో ఒక ప్రత్యేక పాత్రలో నటించడానికి ఒప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే చిత్ర బృందం నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. అసలు ఈ రిమేక్ ఉందా లేదా, ఉంటె అందులో హీరోయిన్ ఎవరు, నిజంగానే స్వాతి అతిథి పాత్ర చేస్తుందా ఈ విషయాలన్నిటికీ చెక్ పెట్టాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.