

తెలుగు, మలయాళ చిత్రాలలో నటి గా పేరు తెచ్చుకున్న మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్. తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఆమె ఇన్స్టా హ్యాండిల్లో తన అందమైన చిత్రాలను, తన పెంపుడు జంతువులను, తన సోదరుడితో సరదా వీడియోలను పోస్ట్ చేస్తారు. ఈ మధ్య అనుపమా ఇన్స్టాలో ఒక చిన్న వీడియోను పోస్ట్ చేసింది. అందులో పొద్దునే వచ్చే సూర్య కిరణాలని ఆస్వాదిస్తూ , పూల స్ట్రాపీ దుస్తులు ధరించి ఆమె తన కర్లీ జుట్టు ని మెల్లగా వెనక్కి తిప్పింది. ఈ వీడియోలో చిన్న పిల్లలాంటి అమాయకత్వంతో అలాగే తన అందంతో అందరి హృదయాలని కొల్లగొడుతోంది. మీకు అలానే అనిపించిందా.