
అను ఇమ్మానుయేల్.. టాలీవుడ్ లో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ పిల్లికళ్ల భామ ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలేమీ చెయ్యట్లేదు. ఇటీవలే అల్లుడు అదుర్స్ సినిమా లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ శర్వానంద్ మహాసముద్రం సినిమాలో సెకండ్ లీడ్ లో నటిస్తుంది.. మలయాళం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన అను టాలీవుడ్ లో మజ్ను సినిమా తో డెబ్యూ చేసింది. ఆతర్వాత పలు చేసినా ఆమెకు ఎందుకో సరైన బ్రేక్ రాలేదు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తే అయినా హిట్ దక్కుతుందో అనుకుని ఆ సినిమా లో చేసింది.

కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో అను ఇక సెకండ్ హీరోయిన్ పాత్రలే వరుసగా చేస్తూ వచ్చింది. పెద్ద హీరోలతో ఛాన్స్ లు కొడుతున్న ఆ సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో ఆమె ఫేడ్ అవుట్ అయిపొయింది.. ఇక ఈమధ్య ఓ డైరెక్టర్ తో ప్రేమలో ఉందన్న వార్తలలో నలిగినా అను ఇమ్యానుయేల్ దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.. ఆక్సిజన్ దర్శకుడు తో అను డేటింగ్ లో ఉందని, వారిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు తెగ హల్చల్ చేశాయి. అయితే ఇది ఇప్పటికైతే గాసిప్ గానే ఉంది. దీనిపై వారెలా స్పందింస్తారో చూడాలి.

తాజాగా అల్లు శిరీష్ అను ఇమ్యానుయేల్ తో కలిసి తీసిన వీడియో ఒకటి పోస్ట్ చేసి లేని అనుమానాలకు దారి తీస్తున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎదో నడుస్తోందన్న డౌట్స్ ని క్రియేట్ చేశాడు. మార్చి 28న అను ఇమ్యానుయేల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెపై ఓ వీడియో తీసి పోస్ట్ చేశాడు శిరీష్. అందులో సైకో అంటూ అను ను ప్రేమగా పిలవడం , ఇద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ చూస్తుంటే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వీడియో చూస్తే మాత్రం వారిద్దరూ ఎంత పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నారో అర్థం అవుతుంది. మరో వీరి రిలేషన్ పై వస్తున్న వార్తలపై వీరు ఎలా స్పందిస్తారో చూద్దాం.