'అంటే సుందరానికీ' హిలేరియస్ గా వుంటుంది..కొత్త నాని ని చూస్తారు: నేచురల్ స్టార్ నాని ఇంటర్వ్యూ!!

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో జరిగింది. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ లో యాక్షన్, డ్రామా, డైలాగ్స్ , ఎమోషన్స్, విజువల్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. నక్సల్ మూమెంట్ నేపధ్యంలో ఓ అద్భుతమైన ప్రేమకథని తెరపై ఆవిష్కారించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.

కామ్రేడ్ రావన్న పాత్రలో రానా నటన అవుట్ స్టాండింగా వుంది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ‘చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవడు.. సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్నినాళ్లు..’ అనే రానా డైలాగ్ తో మొదలైన ట్రైలర్ .. ''ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నేను వెన్నెల ఇది నా కథ'' అని వెన్నెల పాత్ర చెప్పిన డైలాగ్ తో ముగించడం ఆసక్తిగాకరంగా వుంది.  అలాగే ”ఇక్కడ రాత్రుండ‌దు.. ప‌గ‌లుండ‌దు.. ఉన్నతంతా ఊపిరి ఊపిరికి మ‌ధ్య ఊపిరి స‌ల‌ప‌నంత యుద్ధం మాత్రమే”, ”తుపాకీ గొట్టంలో శాంతి లేదు, ఆడపిల్ల ప్రేమలో వుంది”. 'రక్తపాతం లేనిదెక్కడ?.. మనిషి పుట్టుకలోనే ఉంది" డైలాగ్స్ కూడా ఫవర్ ఫుల్ గా ఆకట్టుకున్నాయి. సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం, డానీ సాంచెజ్ లోపెజ్‌ కెమారా పనితనం, నిర్మాణ విలువలు, శ్రీకార్ ప్రసాద్ ఎడిటింగ్ అత్యున్నత స్థాయిలో వున్నాయి. ఈ ట్రైలర్  విరాటపర్వంపై భారీ అంచనాలు పెంచింది.

కర్నూల్ జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ఈదురు గాలులు, వర్షం అంతరాయం కలిగించినప్పటికీ అభిమానులు, పబ్లిక్ సహకారంతో ఈవెంట్ విజయవంతగా జరిగింది. గాలులు, వర్షం కురుస్తున్నపటికీ అభిమానులు ప్రేక్షకులుని ఉద్దేశించి చిత్ర యూనిట్ మాట్లాడారు.

హీరో రానా మాట్లాడుతూ..  దర్శకుడు వేణు ఊడుగుల తన జీవిత కాలంలో చూసిన సంఘటనలతో 'విరాట‌ప‌ర్వం' అనే అద్భుతమైన సినిమా చేశారు. ''చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవడు.. సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్నినాళ్లు..'' ఇలా నేను ఈ చిత్రంలో గొప్ప కవిత్వం చెప్పుకుంటూ వెళితే.. సాయి పల్లవి గారు వెన్నెల అనే మరో అద్భుతమైన వెన్నెల పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో హీరో సాయి పల్లవి. ఇది వెన్నెల కథ.'' అన్నారు

హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ..ట్రైలర్ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. విరాట‌ప‌ర్వం లాంటి కథ రావడం చాలా గర్వంగా వుంది. అన్ని బలమైన పాత్రలతో ఒక ప్రాంతానికి సంబధించిన బలమైన కథ చెప్పాలంటే బలమైన రచయిత కావాలి. అలాంటి బలమైన రచయిత వేణు ఊడుగుల గారి రూపంలో వచ్చారు. తెలంగాణ,  భాష,  ఊరు గురించి అద్భుతంగా చూపించారు. ఇలాంటి గొప్ప కథలో నాకు అవకాశం కల్పించినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఒక శిశువు జన్మకు తల్లితండ్రులు ఎంత ముఖ్యమో.. ఇలాంటి గొప్ప సినిమా రావడానికి దర్శకుడు అంత ముఖ్యం. శ్రీకాంత్ గారు, సుధాకర్ గారు ఈ చిత్రానికి నిర్మాతలు ఏం చేయగలరో దాని కంటే ఎక్కువ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పెద్ద మనసు వున్న వారు వాళ్ళే అంతా చేయాలని అనుకోరు. వెనక వుండి సహాయం చేస్తారు. రానా గారిది కూడా లాంటి గొప్ప మనసు. అన్నీ తానే చేయాలని అనుకోకుండా సినిమా సైన్ చేసినప్పటి నుండి ఇప్పటివరకూ మాకు సపోర్ట్ గా నిలబడ్డారు. రానా గారితో పని చేయడం చాలా గొప్పగా వుంది. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమకి కృతజ్ఞతలు. జూన్ 17 విరాటపర్వం మీ ముందుకు వస్తుంది. అందరూ థియేటర్ లో సినిమా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నా.'' అన్నారు

దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ..  హాయ్ కర్నూల్.. ఈవెంట్ కోసం ఎంత ఓపికగా ఎదురుచూసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. 1990లలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం అద్భుతమైన ప్రేమకథా చిత్రం 'విరాట‌ప‌ర్వం'. జూన్ 17న వస్తున్న ఈ చిత్రాన్ని మీరంతా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి మాట్లాడుతూ.. ఇంత వర్షం, గాలుల్లో కూడా గొప్పగా సహకరించిన కర్నూల్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు'' తెలిపారు

నవీన్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. 'విరాట‌ప‌ర్వం' చాలా అద్భుతమైన సినిమా కాబోతుంది. రానా గారు, సాయి పల్లవి గారితో కలసి నటించడం ఆనందంగా వుంది. ఈ చిత్రంలో మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు ఊడుగులకి, నిర్మాతలకు కృతజ్ఞతలు. 'విరాట‌ప‌ర్వం' ఎప్పటికీ నిలిచిపోయే సినిమా కాబోతుంది. జూన్ 17న ప్రేక్షకులంతా థియేటర్ లో సినిమా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను'' అన్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.