
ఉప్పెన సినిమా కి వచ్చిన అప్లాజ్ ఈమధ్య ఏ సినిమాకి కూడా రాలేదని చెప్పాలి. కలెక్షన్లు కూడా అంతే.. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కి మంచి కలెక్షన్లు వచ్చాయి.. ఎన్నో అంచనాలు మధ్య, వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టింది. ప్రేక్షకులు, మెగా అభిమానులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నాడో ఆ అంచనాలను అయితే వైష్ణవ్ అందుకున్నాడు. ముఖ్యంగా తన నటన తో వైష్ణవ్ మెగా ఫ్యాన్స్ నే కాకుండా నార్మల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు.. ఎక్స్ ప్రెషన్ లో వేరియేషన్స్ చూపించి వైష్ణవ్ అందరి వద్ద మార్కులు కొట్టేశాడు.

అంతేకాకుండా వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై ముందునుంచి మంచి అంచనాలు ఉన్నాయి.. తొలి వీకెండ్ లో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టి ఏ డెబ్యూ హీరో రాబట్టలేనన్ని కలెక్షన్లను రాబట్టుకున్నాడు వైష్ణవ్.. ఏ డెబ్యూ హీరో కి సాధ్యం కానీ కలెక్షన్లను వైష్ణవ్ సాధించాడు. మొదటి సినిమా తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించాడంటే ఫ్యూచర్ లో పెద్ద హీరోలకు పోటీ అవడం ఖాయం అని తెలుస్తుంది.. వైష్ణవ్ తేజ్ తొలి సినిమా అయినా స్టార్ హీరో ఓపెనింగ్స్ వచ్చాయి అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇకపోతే ఈ సినిమా లోని హీరోయిన్ గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి.. తొలి సినిమా నే అయినా కృతి శెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది..
ఇక ఈ సినిమాలోని డెలీటెడ్ సీన్లను రిలీజ్ చేస్తున్న చిత్రబృందం..ఇప్పటికే విజయ్ సేతుపతి రాజీవ్ కనకాల మధ్య ఓ సీన్ ను రిలీజ్ చేశారు.. తాజాగా మరొకటి విడుదల చేశారు.. ఈ వీడియో లో తన కాలనీ అమ్మాయితో వైష్ణవ్ తేజ్ చేసిన కామెడీ అదిరిపోయింది. హీరోయిన్‌కు లవ్ లెటర్ ఇప్పించడానికి హీరో పడే ప్రయత్నాలు ఫన్నీగా అనిపించాయి. అంతేకాదు ఈ సీన్ కోసం గోదారి జిల్లాలో పాడుకునే సరదా పాటను కూడా పెట్టాడు దర్శకుడు బుచ్చిబాబు. దాంతో పాటు విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల మధ్య వచ్చే సీన్ కూడా బాగానే ఉంది. కానీ ఈ రెండు సన్నివేశాలు కూడా పెద్దగా ప్రాముఖ్యత లేనివే. అందుకే వాటిని పక్కనబెట్టాడు దర్శకుడు. మరి ఈ సినిమాలో ఇంకెన్ని ప్రాముఖ్యత లేని సీన్లు ఉన్నాయో మరీ..