ఇండస్ట్రీ లో మరో విషాదం.. కరోనాతో నంద్యాల రవి మృతి..

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో టాలీవుడ్ లోని ప్రముఖులు చనిపోతూ ఇండస్ట్రీ కి తీరని లోటును మిగులుస్తున్నారు.. ఇప్పటికే పలువురు చనిపోగా ఇటీవలే టీ ఎన్ ఆర్ చనిపోయాడు. తాజగా టాలీవుడ్ రచయిత, దర్శకుడు నంద్యాల రవి కూడా మృతి చెందారు.

ఇటీవలే అయనకు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.. ఆయనకు పాజిటివ్ అని తెలియగానే ప్రతి ఒక్కరు ఎంతో కంగారు పడ్డారు.. ఆమహమ్మారీ ఇప్పుడు ఆయనను కూడా బలితీసుకుంది. కరోనా వచ్చాకా . ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ బిల్లు కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే... సినీ నటుడు సప్తగిరి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. చివరకు ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.

పలు చిత్రాలకు నంద్యాల రవి రచయితగా పని చేశారు. 'లక్ష్మీ రావే మా ఇంటికి' అనే సినిమాను డైరెక్ట్ చేశారు. సప్తగిరితో ఓ సినిమాను చేసేందుకు కూడా కథను రెడీ చేసుకున్నారు. ఇంతలోనే కరోనా మహమ్మారి ఆయనను బలితీసుకుంది. నంద్యాల రవి మృతిపై సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.