
కమర్షియల్ సినిమాల్లో కామెడీ ని జోడించి హిట్ సినిమాలు చేసిన దర్శకులు టాలీవుడ్ లో కొంతమందే ఉన్నారని చెప్పొచ్చు..ఆలా టాలీవుడ్ కి దొరికిన అతి కొద్దీ మంది దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి.. మహేష్ బాబు తో సూపర్ హిట్ సినిమా ని చేసిన అనిల్ ఇప్పుడు వెంకటేష్, వరుణ్ తేజ్ లతో f3 ని తెరకెక్కిస్తున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన F2 ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే ఫామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది.
ఈ సినిమా తో వరుసగా నాలుగో హిట్ కొట్టిన దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచాడు. అయన దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పటాస్ సినిమా హిట్ రావడంతోనే టాలీవుడ్ కి ఓ మేలిమి డైరెక్టర్ దొరికిపోయాడని అర్థమైపోయింది.. తొలి సినిమా తోనే హిట్ కొట్టిన అనిల్ ఆ తర్వాత వరుసగా మూడు హిట్ లు కొట్టి టాప్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు. .రాజా ది గ్రేట్, F2 , సరిలేరు నీకెవ్వరూ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేస్తాడని మంచి కితాబు కూడా దక్కించుకున్నాడు..టాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు చాలా తక్కువ ఉన్నారని చెప్పొచ్చు..
తొలి సినిమా హిట్ కాగానే డైరెక్టర్స్ రెండో సినిమాతోనే తుస్ మనిపిస్తారు. కానీ సినిమా సినిమా కి ఎదుగుతూ ఒదిగి ఉంది మళ్ళీ మళ్ళీ హిట్ కొట్టడం కొద్దీ మంది డైరెక్టర్ లకే చెల్లుతుంది..ఇక 2019 సంక్రాంతికు వచ్చిన తన ఎఫ్ 2 చిత్రం కలెక్షన్స్ పరంగా ఓ ఊపు ఊపేసింది భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరూ అంటూ మహేష్ తో చేసిన చిత్రం కూడా సంక్రాంతికి విడుదల అయి.. సక్సెస్ అయ్యింది. దాంతో ఎఫ్ 3 కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తే నిర్ణయం నిర్మాత దగ్గర వ్యక్తం చేసినట్లు సమాచారం.