
కామెడీ ఎంటర్టైనర్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్నదని వస్తున్న వార్తలకి ఓ సమాధానం దొరికింది. వీరి కాంబో లో సినిమా తెరకెక్కాలనుకునేవారు కోరుకున్నట్లు ఈ సినిమా త్వరలోనే తెరకెక్కబోతుంది తెలుస్తుంది. వాస్తవానికి బాలకృష్ణ 100వ సినిమాను తన కథతో అనిల్ రావిపూడి చేయాలనుకున్నాడు .. కానీ కుదరలేదు. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు.

అనిల్ రావిపూడి చెప్పిన ఒక లైన్ బాలయ్యకి నచ్చిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన అనిల్ రావిపూడి, తాజాగా దానిని బాలకృష్ణకి వినిపించాడట. బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ .. గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఆ తరువాత అనిల్ రావిపూడి ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ లోగా అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమాను పూర్తిచేస్తాడన్న మాట. వెంకటేశ్ - వరుణ్ తేజ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాను 'సంక్రాంతి'కి విడుదల చేయనున్నారు.