16 ఏళ్లకే అతనితో డేటింగ్.. తన ఫస్ట్ రిలేషన్ పై ఓపెన్ అయిన అనసూయ..!!

యాంకర్ నుంచి నటిగా మారిన అనసూయ తన గురించి కొన్ని కొత్త కొత్త విషయాలను వెల్లడిస్తోంది. తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తన ఫస్ట్ రిలేషన్ పై ఓపెన్ అయ్యింది. పదహారేళ్లకు తాను డేటింగ్ చేశానని చెప్పుకొచ్చింది.. కెరీర్ మొదట్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అనసూయ రేంజ్ జబర్దస్త్ షోతో  ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పొచ్చు.. అంతకుముందు చిన్న చిన్న షో లు చేసినా రాని గుర్తింపు జబర్దస్త్ అనే ఒక్క షోతో వచ్చింది. ఆ షోలో వచ్చిన గుర్తింపుతోనే ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు.

టీవీ, బిగ్ స్క్రీన్ లలోనే కాదు సోషల్ మీడియా లోనూ అనసూయ ఎంతో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సోషల్ విషయాలపైనా కూడా అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ వస్తుంది.. అంతేకాదు సరికొత్త ఫోటో లను పెడుతూ తన అభిమానులను ఊరిస్తుంది..  కనిపించి కనపడని అందాలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి అందరి ఇంట్రెస్ట్ తనపై ఉండేలా చేసుకుంటుంది.. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తనగురించి సంచలన విషయాలు తెలిపింది అనసూయ..

16 ఏళ్ల వయసులో సాక్షి ఛానల్‌లో యాంకర్‌గా కెరియర్ మొదలుపెట్టిన అనసూయ అప్పట్లోనే డేటింగ్‌లో ఉన్నట్టు చెప్పింది. తన భర్త సుశాంక్ భరద్వాజ్‌తో అప్పట్లోనే ప్రేమలో ఉన్న సీక్రెట్ లవ్‌ స్టోరీని రివీల్ చేసింది అనసూయ. పద్దతిగల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను.. దుపట్టాకి గంజి పెట్టి మరీ ఇలా ఒంటిపై కప్పేది మా అమ్మ. ఇప్పుడు మోడ్రన్ డ్రెస్‌లు వేసుకున్నప్పుడు నేను ఇలా పెరగలేదు కదా అని అనిపించదు. మా అమ్మ వాళ్లు నన్ను ఎప్పుడూ ఆపలేదు.. నేను పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నా ఏంటి అని ఆలోచనే రాలేదు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్లు నన్ను అలా చూసేవారు కాదు. మా అమ్మ, భర్త, అత్త మామల్ని కూడా ఆడియో ఈవెంట్లకు తీసుకుని వచ్చే దానిని అని చెప్పింది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.