అదరగొడుతున్న ఆనంద్ దేవరకొండ కొత్త లుక్..!!

దొరసాని , మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో ఆనంద్ దేవరకొండ తన మూడో చిత్రం విడుదల కాకుండానే నాలుగో చిత్ర షూటింగ్ ని మొదలుపెట్టాడు.  రెండో సినిమాతో  సూపర్ హిట్ సాధించి హీరోగా నిలదొక్కుకున్న ఆనంద్ దేవరకొండ  దామోదర అనే కొత్త దర్శకుడితో పుష్పకవిమానం అనే సినిమాను మొదలు పెట్టారు ఆనంద్ దేవరకొండ. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా అలరించగా కళ్యాణం అనే పాట ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. రామ్ మిరియాల సంగీతం అందిస్తున్న ఈ పాట ను సిడ్ శ్రీరామ్ ఆలపించడం విశేషం.  ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల కాకముందే ఆనంద్ దేవరకొండ తన నాలుగో సినిమా "హైవే" ను పట్టాలెక్కించాడు. సినిమాటోగ్రాఫర్ గా టాలీవుడ్ లో ఎన్నో పెద్ద పెద్ద చిత్రాలకు పనిచేసిన కె.వి.గుహన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ హైవే చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.

118 సినిమాతో దర్శకుడిగా మారిన గుహన్ ఈ సినిమాను దేవరకొండ అభిమానులకు నచ్చే విధంగా చేయబోతున్నారట. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సైమన్ కింగ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అని ఈ చిత్ర బృందం ట్విట్టర్లో పేర్కొంది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.