వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆనంద్ దేవరకొండ..!!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయన హీరోగా చేస్తున్న మూడో సినిమా పుష్పక విమానం పూర్తి కావడంతో తదుపరి చిత్రాలపై అయన ప్లానింగ్ లో ఉన్నాడు.. ఇప్పటికే ఆయన సినిమాలు కొన్ని అనౌన్స్ కాగా నాలుగో చిత్రంగా గుహన్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

'118' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కేవీ గుహన్ దర్శకత్వంలో 'హైవే' చేయనున్నాడు. 'కలర్ ఫోటో' సినిమాకి కథను అందించిన సాయి రాజేశ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో .. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో .. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఒక్కో సినిమాను చేయనున్నాడు. ఇవన్నీ కూడా ఒకదాని తరువాత ఒకటి సెట్స్ పైకి వెళ్లనున్నాయి .. అదే క్రమంలో థియేటర్స్ లో దిగనున్నాయి.

దొరసాని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసిన ఆనంద్ రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత మూడో సినిమా పుష్పక విమానం అయన కు ఏ రేంజ్ హిట్ ఇస్తుంది చూడాలి. దామోదర అనే కొత్త దర్శకుడు ఈ సినిమా కి దర్శకుడు కాగా గీత సైని ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.