
స్టార్ డైరెక్టర్ శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భారతీయుడు 2.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 1996లో విడుదలై సంచలనం సృష్టించిన భారతీయుడు సినిమా కి సీక్వెల్.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చేస్తుండడం విశేషం.. ఇంత పెద్ద సినిమాను మొదలు పెట్టను అయితే మొదలు పెట్టారు గాని మొదలుపెట్టిన దగ్గర్నుంచీ సినిమాకి అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతున్నాయి..

కరోనావల్ల సినిమా షూటింగ్ ఆగిపోవడం తో అప్పటికే ఉన్న విబేధాల వల్ల ఈ సినిమా కూడా పూర్తిగా ఆగిపోయింది.. అయితే కమల్ హాసన్ రాజకీయాల్లో ఓడిపోవడంతో మళ్ళీ సినిమాలపై ఫోకస్ మళ్లించాడు. తన చేతిలో ఉన్న భారతీయుడు 2ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది కమల్ ప్లాన్. అయితే ఆ సినిమా నిర్మాత, దర్శకుడి మధ్య విబేధాలతో ఆగిపోయింది. ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించాలని పూనుకున్నాడట కమల్.

వీలైనంత త్వరలో.. శంకర్, లైకా ప్రొడక్షన్స్ తో సంధి కుదర్చాలని భావిస్తున్నాడు. తన సినిమా విషయంలో వచ్చిన అడ్డంకిని తానే తొలగించాలని భావిస్తున్నాడు. కమల్ పెద్ద మనిషి స్థానంలో కుర్చిని రాజీ కుదిరిస్తే.. తమకెలాంటి అభ్యంతరం లేదని శంకర్, లైకా నిర్మాతలు తేల్చి చెప్పేశారు. కాబట్టి. త్వరలోనే భారతీయుడు 2 వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం వుంది.