ఆర్.ఎస్ 92 థీమ్ పోస్టర్ అదిరిందిగా

యాంగ్రీ యంగ్ మ్యాన్ డా. రాజశేఖర్ గారు నటిస్తున్న 92వ చిత్ర థీమ్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆఫ్ బీట్ ఫిల్మ్స్, ఎస్. ఒరిజినల్స్ బ్యానర్ పై శివాని, శివాత్మిక, సృజన్ యరబోలు, భార్గవ్, హర్ష ప్రతాప్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా, యువ దర్శకుడు కిరణ్ కొండమడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతమ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కిరణ్ తన తదుపరి చిత్రాన్ని రాజశేఖర్ గారితో చేస్తుండడం విశేషం. చిత్రబృందం విడుదల చేసిన థీమ్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక న్యూస్ పేపర్లో ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తూ రైట్ సైడ్ లో ‘Makers of Gatham announce their second’ అనే హెడ్డింగ్ తో ఒక ఆర్టికల్, పైన పెద్ద అక్షరాలతో “Sex Trafficking has become a $100 billion industry’ అనే హెడ్డింగ్ తో ఒక ఆర్టికల్ ఉన్నాయి. న్యూస్ పేపర్ పక్కన ఒక గన్, బులెట్స్, ఒక పెగ్ గ్లాస్, దాని పైన ఒక లైట్ చేసిన సిగార్, న్యూస్ పేపర్ మీద గాగుల్స్ ఈ థీమ్ పోస్టర్లో ఉన్నాయి. ఈ పోస్టర్ ని బట్టి ఈ చిత్రం విమెన్ ట్రాఫికింగ్ పై ఉంటుందేమో అని చిత్ర వర్గాల టాక్. విభిన్న కథలని ఎంచుకుంటూ తన మార్క్ వేస్తున్నారు రాజశేఖర్ గారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.