
అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అల్లు శిరీష్. కొత్త జంట, శీరస్తు శుభస్తు, ఏబిసిడి, ఒక్క క్షణం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడు తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో శిరీష్ కి అను ఇమ్మాన్యుయెల్ జంటగా నటిస్తోంది. అల్లు అరవింద్ గారి నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద ఈ చిత్రం నిర్మితమైంది.

ఈ వివరాలను తెలుపుతూ విడుదల చేసిన ప్రీ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక అమ్మాయి, అ అబ్బాయి ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకుంటున్న ఒక రొమాంటిక్ స్టిల్ ని విడుదల చేశారు. ఈ ప్రీలుక్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. చూస్తున్న వారి దగ్గర నుండి ఈ స్టిల్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ సినిమా పై అంతటా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణలతో, పాటు పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నారు.
Excited to be sharing the title & first look of #Sirish6 on May 30 (Sunday, 11am) @ItsAnuEmmanuel @GA2Official #rakeshsashii pic.twitter.com/4jOYadlxkx
— Allu Sirish (@AlluSirish) May 27, 2021
అల్లు శిరీష్ కి ఇది 6వ చిత్రం ఇప్పటి వరకూ సరైన హిట్ కొట్టలేదు. సొంతంగా ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకోలేకపోయాడు. అతనికంటే జూనియర్లు వచ్చి హిట్స్ కొడుతున్నా ఆయన మాత్రం ఇప్పటి వరకూ మంచి హిట్ కొట్టలేదు. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే శిరీష్ కి మంచి హిట్ రాబోతోందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. వారి మాటలు నిజమై కనీసం ఈ సినిమాతోనైనా తనదైన మార్క్ వేస్తాడో లేదో వేచి చూడాలి.