అల్లు రామలింగయ్య గారు చిరస్మరణీయుడు ఆయన మరణించలేదు మన మద్యే ఉన్నారు - మెగాస్టార్ చిరంజీవి!!

ప్రముఖ నటుడు, నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడైన పద్మశ్రీ  అల్లు రామలింగయ్య గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు ఫ్యామిలీ పలు కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా గత రాత్రి జరిగిన శతజయంతి వేడుకలకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన, చిరంజీవి సతీమణి సురేఖ (అల్లు రామలింగయ్య కుమార్తె), అలాగే అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అల్లు రామలింగయ్యపై రాసిన పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, తొలి ప్రతిని మెగాస్టార్ చిరంజీవికి అందించారు.ఈ సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు స్వర్గీయ అల్లు రామలింగయ్య సినీ రంగానికి చేసిన సేవల గురించి కొనియాడారు.


శతజయంతి వేడుకలో బ్రహ్మానందం గారు మాట్లాడుతూ...
ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ, అల్లు రామలింగయ్య గారితో తనకు ఏర్పడిన పరిచయాన్ని తెలిపారు.
అల్లు రామలింగయ్య గారకి బ్రతుకు విలువ, మెతుకు విలువ తెలిసినవాడు కాబట్టి ఆ కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో ఆయనకి తెలుసు.
అల్లు అరవింద్ లాంటి బిడ్డను కన్నందుకు ఆయన ఎంతగానో ఆనందిస్తారు.ఆయన ఎప్పటికి మన మధ్యలోనే ఉంటారు. అల్లు రామలింగయ్య గారి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.



అల్లు అర్జున్ మాట్లాడుతూ...
అల్లు రామలింగయ్య గారికి సినీపరిశ్రమలో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు అల్లుడుగా వచ్చి ఆయన స్థాయిని ఎన్నో రేట్లు పెంచిన చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే పుస్తకాన్ని ఆవిష్కరించిన  మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి   , పుస్తకాన్ని రాసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ...
ఆయనతో నాకు ఉన్న అనుబంధం ఇంకెవరితోను లేదు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అల్లు రామలింగయ్య గారిని మొదటి సారి చూసిన సమయంలోనే ఆయన తీరును చూసి ఆశ్చర్యపోయాను. షూటింగ్ సమయంలో చాలా మంది ఉండగా ఆయన నా వైపే పదే పదే చూస్తూ నన్ను గమనించడం చేసేవారు. ఆ సమయంలో నాకు ఆయన ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాలేదు కానీ ఆ తర్వాత అర్థమైంది.అల్లు రామలింగయ్య గారు ఒకసారి షూటింగ్ పూర్తి చేసుకొని రైల్లో వెళుతున్న గా పక్కన కూర్చోబెట్టుకొని మందు తాగుతావా అంటూ నన్ను అడిగాడు. అప్పటికి నాకు అలవాటు లేదండి అని హనుమాన్ భక్తున్ని అంటూ అక్కడి నుంచి వెళ్లాను. అలా నా గురించి పలుసార్లు ఆయనకు పాజిటివ్ గా అనిపించింది.ఆ తర్వాత నా వద్ద నిర్మాత వచ్చి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. నేను మాత్రం కెరియర్ లో ఇప్పుడే నిలదొక్కుకుంటున్నాను.. కనుక ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పేశాను.. అయినా కూడా వినకుండా మెల్లగా మా నాన్నగారి దగ్గరికి వెళ్లి ఇండస్ట్రీలో చిరంజీవి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు, అమ్మాయిలు చాలామంది ఆయన్ని లాక్కొని ప్రయత్నం చేస్తారు.కనుక ఇప్పుడే పెళ్లి చేస్తే బాగుంటుంది అన్నట్లుగా మా నాన్న గారితో చెప్పడంతో మా నాన్నగారు నన్ను ఒప్పించారు. ఇష్టం లేకుండానే అల్లు రామలింగయ్య గారింటికి పెళ్లి చూపులకు వెళ్ళాము.అక్కడ సురేఖని చూసిన తర్వాత నో చెప్పలేకపోయాను. ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాను, ముందు ముందు మరింత భవిష్యత్తు ఉంటుంది. పెళ్లికి ఎస్ చెప్పాలా నో చెప్పాలా అని సంశయిస్తూ ఉండగా సురేఖని చూసి నో చెప్పలేక ఓకే చెప్పాను, పెళ్లయింది అంటూ సరదాగా అప్పటి విషయాలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు.అల్లు రామలింగయ్య గారిని ఆయనొక నిరంతర విద్యార్థి , చిరస్మరణీయుడు ఆయన మరణించలేదు మన మద్యే ఉన్నరని  కొనియాడారు.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ...
అల్లు రామలింగయ్య గారి పుస్తకావిష్కరణలో పాల్గోవడం మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయన పిల్లందరికి నా ఆశీర్వచనాలు, ఆయనకు నా నివాళులు.  సినిమాలలో ఉన్నత విలువలు, కొన్ని సంప్రదాయాలు నిలబెట్టిన వాళ్లలో అల్లు రామలింగయ్య అగ్రఘన్యుడు. ఏ విధమైన అసభ్యత లేకుండా,  కేవలం తన హావభావాలతో నవ్వించగల నటులు అల్లు రామలింగయ్య. అంటూ కొనియాడారు.  

ఆ సందర్భంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లు రామలింగయ్య గారి యొక్క గొప్పతనం ను మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల విజయాలను గురించి అద్భుతంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు.అల్లు రామలింగయ్య గారి వారసత్వం ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఊహించడం కూడా వృధా, వారి వారసత్వం రాబోయే తరాలు నిలిచి పోతుందని.. రాబోయే తరాలు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని నిలుపుతాయంటూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.అల్లు అరవింద్, అల్లు అర్జున్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అందరికి  కూడా ఆయన ఒక మార్గ నిర్దేశం చేసి వెళ్లారు. ఇప్పుడు ఆ మార్గంలో అద్భుతమైన జర్నీని వారు కొనసాగించడం అభినందనీయమంటూ త్రివిక్రమ్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.