
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబో లో రాబోతున్న చిత్రం పుష్ప సంక్రాంతి కి రాబోతుంది.. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా విలన్ గా మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. సుకుమార్ రంగస్థలం తర్వాత అదే జోనర్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు..

కరోనా తీవ్రత పెరిగే సమయానికి ఈ సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఇక షూటింగును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో ఆపేశారు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా షూటింగును కొనసాగించేందుకు సుకుమార్ చకచకా సన్నాహాలు చేస్తున్నాడట. వచ్చేనెల మొదటివారంలో షూటింగును మొదలుపెట్టి .. నెలాఖరుకి షూటింగు పార్టును కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఈ షెడ్యూల్లో ప్రధాన పాత్రధారులంతా పాల్గొంటారట.

'పుష్ప' సినిమాకి సంబంధించిన నిర్మాణానంతర పనులను ఆగస్టు .. సెప్టెంబర్ మాసాల్లో పూర్తిచేసి, దసరాకి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 'పుష్ప' సినిమా తరువాత అల్లు అర్జున్ 'ఐకాన్' సినిమా చేయనున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.