
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె షూటింగ్ లో పాల్గొనగా ఓ కీలమైన పాత్రలో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తుంది. సమంత మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ షెరవేగంగా జరుగుతుండగా తాజగా అల్లు అర్జున్ సందడి చేసిన కొన్ని ఫోటో లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగు, తిరిగి ఇటీవలే మొదలైంది.

కొన్ని రోజులుగా శకుంతల .. దుష్యంత .. భరత పాత్రల కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగు జరుగుతున్న లొకేషన్ కి వచ్చాడు. అక్కడ చిత్రీకరణ జరుగుతున్న సన్నివేశాలను గురించి అడిగి తెలుసుకున్నాడు. దేవ్ మోహన్ ను కలుసుకుని ఆత్మీయంగా మాట్లాడాడు.

అల్లు అర్జున్ ను కలుసుకోవడం పట్ల దేవ్ మోహన్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కీలమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. 'క్రిస్మస్'కి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.