
సమ్మోహనం, V, నవాబ్, చెలియా వంటి సినిమాల్లో నటించిన నటి అదితి రావ్ హైదరీ. తన నటనతో ప్రేక్షకులను సమ్మోహన పరుస్తూ ఉంటారు. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన 'సూఫియం సుజాతయుమ్' అనే మలయాళ సినిమాలో మూగ అమ్మాయిగా అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. సెవెన్ స్క్రీన్స్ పతాకంపై, నిర్మాత లలిత్ కుమార్ నిర్మాణంలో, ఢిల్లీ ప్రసాద్ దర్శకత్వంలో, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న "తుగ్లక్ దర్బార్" అనే తమిళ సినిమాలో మొదట హీరోయిన్ గా అదితి రావ్ హైదరిని తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సినిమా నుండి తప్పుకున్నారు.ఇప్పుడు ఆమె స్థానంలో ఊహలు గుసగుసలాడే, సుప్రీం, రాజ ది గ్రేట్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన "రాశీ ఖన్నా" నీ తీసుకున్నారు. తాను సినిమా నుండి తప్పుకోవడానికి గల కారణనాలను వివరిస్తూ ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
— Aditi Rao Hydari (@aditiraohydari) October 20, 2020
"తుగ్లక్ దర్బార్ అనే సినిమాలో నేను నటించడం లేదు, కరోనా వల్ల భారతీయ చలన చిత్ర పరిశ్రమతో సహా ప్రపంచ చిత్ర పరిశ్రమే గత ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశల వారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్ మొదలు పెట్టారు. షూటింగ్స్ ప్రారంభించిన ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే ప్రారంభించిన ప్రాజెక్ట్స్ నా వల్ల ఆలస్యం కాకూడదని అనుకుంటున్నాను. అందుకని ఈ సినిమాలో నటించడం కుదరట్లేదు. ఈ చిత్ర బృందానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను చేయాల్సిన పాత్రని చేయబోతున్న రాశీ ఖన్నాకు ఆల్ ది బెస్ట్". అని అదితి రావ్ హైదరీ పేర్కొన్నారు.