ఆడపిల్లలందరూ కుటుంబంతో కలసి ‘రైటర్ పద్మభూషణ్‌’ని చూడాలి: ‘సెలబ్రేటింగ్‌ హౌస్‌ఫుల్‌’ ఈవెంట్లో నిర్మాత అల్లు అరవింద్!!

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్  నిర్మించిన ఈ చిత్రాన్ని  జి. మనోహర్ సమర్పిస్తున్నారు.  ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ‘సెలబ్రేటింగ్‌ హౌస్‌ఫుల్‌’ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించింది.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రైటర్ పద్మభూషణ్ సినిమా చూసిన తర్వాత ఇది తప్పకుండా మేము రిలీజ్ చేయాల్సిన సినిమా అనిపించింది. ప్రతి అడపిల్ల తన తండ్రులని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళాలి. అడ పిల్ల మనసులో ఏముందో, వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి వాళ్ళ మనసులోకి తొంగి చూసి వాళ్ళ కలలని తీర్చడానికి ఈ సినిమా మహత్తరంగా ఉపయోగపడే సినిమా. అందుకే కుటుంబం అంతా కలసి రైటర్ పద్మభూషణ్ ని చూడాలి. సినిమా చివర్లో అడపిల్లల కలలని గురించి, వారి ఇష్టాలు గురించి ఇంత అద్భుతంగా తెరపై ఆవిష్కరించడం చాలా ఆనందాన్ని ఇచింది. ఆడపిల్లలు ఇంట్లో కూర్చోవడాన్ని నేను ఒప్పుకోను. అది వ్యక్తిగతంగా ఇష్టం వుండదు. ఈ సినిమా చూసిన తర్వాత మా ఆవిడని నువ్వు ఏం కావాలని అనుకున్నావ్ ? అని అడిగాను. దర్శకుడు ప్రశాంత్ గొప్ప సినిమా  తీశాడు. సుహాస్ కలర్ ఫోటో ఆహాలో ఫస్ట్ హిట్. సుహాస్ చాలా సహజమైన నటుడు. శరత్, అనురాగ్, చంద్రు .. వీళ్ళంతా గోల్డెన్ టీం. టీనా, గౌరీ ప్రియ చాలా చక్కగా నటించారు. మ్యూజిక్, ఎడిటింగ్.. అన్నీ అద్భుతంగా వున్నాయి. మళ్ళీ అడపిల్లల అందరికీ చెబుతున్నా మీ తల్లితండ్రులని అన్నదమ్ములని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.  

సుహాస్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ పండుగ, కలర్‌ ఫొటో.. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్‌’ ..ఇలా నన్ను ఎంతోగానో సపోర్ట్ చేస్తున్న అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. హౌస్ ఫుల్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. మా సినిమాకి హౌస్ ఫుల్స్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. అనురాగ్, శరత్ అన్నకి థాంక్స్. వాళ్ళు ఛాయ్ బిస్కెట్ పెట్టకపోయి వుంటే మేము వుండేవాళ్ళం కాదు. చంద్రు గారికి కృతజ్ఞతలు. మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ కి థాంక్స్. టీనా, గౌరీ కి థాంక్స్. ఈ సినిమాలో నా ఫ్రండ్ పాత్ర చేసిన ప్రవీణ్ నటనకు కూడా మంచి రెస్పాన్ రావడం అనందంగా వుంది. ఛాయ్ బిస్కెట్ టీం కి కృతజ్ఞతలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. ఈ సినిమా విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది’’ అన్నారు.

శరత్ మాట్లాడుతూ.. అల్లు అరవింద్ గారి సపోర్ట్ తో మేము ముందుకు వెళ్లాం. 2012లో ఫస్ట్ షో అనే మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాం. మా మొదటి సంపాదన కూడా ఆయన చేతుల మీదగానే తీసుకున్నాం. ఛాయ్ బిస్కెట్ కి కూడా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. మా మొదటి సినిమా రైటర్ పద్మ భూషణ్ ని గొప్పగా విడుదల చేసి సక్సెస్ మీట్ లో ఒక పెద్ద దిక్కులా వచ్చిన అల్లు అరవింద్ గారికి పాదభివందనం. ఈ సినిమా ప్రిమియర్స్ కి హౌస్ ఫుల్స్ అయి మెట్ల మీద కూర్చుని జనాలు చూశారు. రిలీజైన రోజు నుంచి హౌస్ ఫుల్స్ అయ్యాయి. అందుకే ఈ వేడుకకు సెలబ్రేటింగ్ హౌస్ ఫుల్స్ అని పెట్టాం. సినిమా అందరికీ నచ్చుతుంది. అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. జనాలు థియేటర్స్ కావాలని కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంతకంటే మేము ఏం కోరుకోలేదు. మనోజ్, ఉదయ్ , సుమంత్ అండ్ టీం, ఛాయ్ బిస్కెట్ టీం కు కృతజ్ఞతలు.  సుహాస్ డ్యాన్స్ చేస్తుంటే, ఎంట్రీ ఇస్తుంటే ప్రేక్షకులు అరుస్తున్నారు.ఈ సినిమాలో సుహాస్ స్టార్ మెటిరియల్ అయ్యారు. దీనికి కారణం కలర్ ఫోటో. ఆయన సినిమా ఆహా లో రిలీజ్ చేసిన పబ్లిసిటీ చేసింది అరవింద్ గారే. ఆ ఫలితాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. కలెక్షన్స్ అద్భుతంగా వున్నాయి. తొలి రోజు 1.6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. వీకెండ్ కి 5 కోట్లు చేస్తామని అంటున్నారు. సినిమా ఫ్యామిలీస్ కి , యూత్ కి చాలా నచ్చింది. సినిమాకి ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చింది ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేస్తామని కోరుకుంటున్నాం. సోమవారం నుంచి ‘సినిమా చూద్దాం. డిన్నర్‌ చేద్దాం’ అనే క్యాప్షన్ తో తెలంగాణ, రాయలసీమ టూర్ చేయబోతున్నాం’’ అని తెలిపారు.

అనురాగ్ మాట్లాడుతూ.. మహేష్ బాబు గారు, అడివి శేష్ గారు ఇచ్చిన సపోర్ట్ తో మేజర్ సినిమా చేశాం. ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతో ఛాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ ఈ సినిమా చేశాం. అందరూ కొత్తవాళ్ళతో సినిమా చూస్తారా అనే అనుమానం వుండేది.  అయితే కంటెంట్ లో సోల్ వుంది. దాన్ని నమ్ముకొని వెళ్లాం. అల్లు అరవింద్ గారు విడుదల చేయడం ఇంకా నమ్మకాన్ని పెంచింది. ప్రిమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల రియాక్షన్ చూస్తే మంచి సినిమా తీశామనే ఆనందం కలిగింది. ఒక్క టికెట్ తెగుతుందా అనే దగ్గర నుంచి ప్రతి షో హౌస్ ఫుల్స్ అయి థియేటర్స్ యాడ్ చేసే పరిస్థితిలోకి రావడం దేవుడు, పెద్దల దీవెనలు.  కుటుంబం అంతా కలసి చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీ తో చూస్తే ఈ సినిమా అనుభవం మరో స్థాయిలో వుంటుంది. అందరూ కొత్తవాళ్ళతో తీసినా.. మేము టికెట్ కొంటాం థియేటర్స్ కి వస్తాం సినిమా చూస్తామని మమ్మల్నీ సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ తెలిపారు.

దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ.. అనురాగ్, శరత్ అన్నకి థాంక్స్. ఛాయ్ బిస్కెట్ వలనే ఇక్కడ నిలుచొగలిగాను.   ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఫ్యామిలీ అందరితో కలసి చూడగలిగే సినిమాలే ఇష్టం. అలాంటి సినిమాలే చేస్తాను. ప్రతి ఒక్కరం ప్రేమించి చేసిన సినిమా ఇది. ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందంగా వుంది. సినిమాని మరింత పెద్ద విజయం చేయాలి’’ అని కోరారు.

చంద్రు మాట్లాడుతూ.. ఈ సినిమాని విడుదల చేసిన గీతా ఆర్ట్స్ కి కృతజ్ఞతలు. అనురాగ్ , శరత్, ఛాయ్ బిస్కెట్ టీం తో ప్రయాణం గొప్పగా అనిపించింది. సుహాస్ తో పాటు మిగతా నటీనటులు అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు.  

టీనా మాట్లాడుతూ.. అల్లు అరవింద్‌గారికి థాంక్స్. రైటర్ పద్మభూషణ్ నా మొదటి సినిమా. ఈ సినిమాతో చాలా మంచి విజయాలు నేర్చుకున్నాను. అనురాగ్ , శరత్ గారికి కృతజ్ఞతలు. సుహాస్ దర్శకుడు ప్రశాంత్ టీం అందరితో కలసి పనిచేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయాన్ని మా అమ్మకు అంకితం చేస్తున్నా’’ అన్నారు. గౌరీ ప్రియ,  కళ్యాణ్ నాయక్  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.