
బిగ్ బాస్ షో తో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు అలీ రెజా.. ఆ కార్యక్రమంలో ఒకసారి ఎలిమినేటి అయ్యి బయటకు వెళ్లి మళ్ళీ లోపలి వచ్చాడు అలీరేజా. షో లో శివ జ్యోతి తో సిస్టర్ బ్రదర్ రిలేషన్ షిప్ ఇప్పటికీ కొనసుగుతుంది. అప్పుడప్పుడు వీరి ఫోటోలు సోషల్ మీడియా లో వీరి ఫోటోలు హల్చల్ చేస్తుంటాయి.. యాంగిరి యంగ్ మాన్ గా అయన షో లో చూపించిన ఉత్సాహాన్ని అందరు సమర్ధించేవారు.. అందుకే అయన రీ ఎంట్రీ మళ్ళీ లభించింది..

ఇక షో ముగిశాక అలీరేజా సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో నాగార్జున వైల్డ్ డాగ్ లో ఓ అవకాశం వచ్చింది. ఏప్రిల్ 2 న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.. ఈ సినిమా లో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నారు.అలీరెజాతో పాటు సయామీ ఖేర్ కీలక పాత్రలు చేస్తున్నారు.. .సాల్మన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలుండగా నాగార్జున కి మస్ట్ నీడెడ్ హిట్ సినిమా అయ్యింది.

తాజా అలీరేజా లైవ్ లోనే యాంకర్ మెడ పెట్టుకొని కొట్టేవరకు వెళ్ళాడు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ చాలా తక్కువ చేసి మాట్లాడంతో అలీ గొడవకు దిగాడు.నాగార్జున లేకుండా కేవలం విళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చూస్తారు అంటూ యాంకర్ అనడంతో అలీ కోపానికి లోనయ్యారు. పది నిమిషాల అనంతరం మాటా మాటా పెరగడంతో గొడవ కూడా ముదిరింది. అలీ రెజా ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ పైకి కోపంతో వెళ్లి అతని మెడ పట్టుకున్నాడు. ఇతర నటీనటులు ఆపే ప్రయత్నం చేసినప్పటికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు.అందుకు సంబంధించిన క్లిప్పింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. జనాలు కూడా అది నిజమని అనుకున్నారు. అయితే యూ ట్యూబ్ ఒరిజినల్ విడియోలోకి వెళ్ళాక అసలు మ్యాటర్ అర్ధమయ్యింది. అదంతా ప్రాంక్ వీడియో అని. తెలుగులో బెస్ట్ యూ ట్యూబ్ ప్రాంక్ ఛానెల్ గా క్రేజ్ అందుకున్న ఫన్ పటాక వాళ్ళు చిత్ర యూనిట్ పై ప్రాంక్ చేశారు.