
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అఖండ.. మాస్ చిత్రాలకు పెట్టింది పేరు గా నిలిచిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు.. కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది.. టీజర్ తో పాటు టైటిల్ కూడా రివీల్ చేసి బాలకృష్ణ అభిమానులను ఖుషి చేశాడు బోయపాటి.. ఆయన గత చిత్రం వినయ విధేయ రామ దారుణమైన ఫలితాన్ని మిగల్చడం తో ఈ సినిమాపై 100% ఫోకస్ నిలిపాడు..
ఇంకా టీజర్ యొక్క స్పందన విషయానికి వస్తే, బాలయ్య ప్రతి సినిమాలో ఉండేలాగానే ఈ సినిమాలో కూడా పవర్ ఫుల్ డైలాగులు, అదిరిపోయే డైలాగులు అడుగడుగున ఉన్నాయని ఒక్క టీజర్ తోనే తేలిపోయింది.. ఇక ఈ టీజర్ లో బాలయ్య లుక్ ఓ రేంజ్ లో ఉంది.. శాంపుల్ గా ఇందులో చెప్పిన డైలాగ్ సెన్సేషన్ అవుతుంది.. "కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది".. ఎంతో ఆవేశంగా చెప్పిన ఈ డైలాగ్ ఫ్యాన్స్ కి కన్నుల పండుగగా ఉందని చెప్పొచ్చు..
ఇదిలా ఉంటె ఈ మూవీకి గానూ బాలయ్య తీసుకుంటున్న పారితోషికం చాలా తక్కువ అని అంటున్నారు. ఆయన ఏడు కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లుగా వార్త వచ్చింది. నిజంగా ఇది గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇక బాలయ్య మొదట్లో ఈ మూవీ కోసం పది కోట్లు అడిగినట్లుగా వార్తలు వచ్చినా కూడా సినిమా బడ్జెట్ ఎక్కువ కాకూడదు అన్న దాని మీద తాను డిమాండ్ ఏ మాత్రం చేయకుండా నిర్మాత ఇచ్చినదే తీసుకున్నారు అంటున్నారు.