
వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన సినిమా అఖిల్ .. అఖిల్ తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. అంతేకాదు ఎన్నో కథలను చూసి మరీ చివరికి ఈ సినిమా కథను ఫైనల్ చేసాడు నాగార్జున.. రిలీజ్ అయ్యాక గాని ఈ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అవుతుందో గ్రహించలేకపోయారు.. ఇక రెండు మూడు సినిమాల గురించి చెప్పనవసరం లేదు.

అఖిల్తా జా చిత్రంగా రానున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా పైనే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కాకముందే అఖిల్ మరో సినిమా కోసం రంగంలోకి దిగిపోయాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కరోనా ప్రభావం తగ్గగానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. అఖిల్ ను సురేందర్ రెడ్డి డిఫరెంట్ లుక్ తో చూపించనుండటంతో, అభిమానులందరిలో ఆసక్తి పెరిగిపోతోంది.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను సీనియర్ స్టార్ హీరోలతో చేయిస్తే బాగుంటుందని భావించిన సురేందర్ రెడ్డి, ఆ పాత్రకి కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్ర అయితే బాగుంటాడని ఫిక్స్ అయ్యాడట.