ఎ. కె లకు జోడిలు ఫిక్స్ అయినట్లు ఉన్నారుగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కథనాయకులగా నటిస్తున్న ఎ.కె అఫీషియల్ రిమేక్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మొన్నటి వరకూ రానా, పవన్ కళ్యాణ్ ఇద్దరూ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కాస్త విరామం తీసుకుని వాళ్ళ సినిమా రిలీజ్ పనులు చూసుకుని రానా, కళ్యాణ్ లు ఇద్దరూ సినిమా షూటింగ్ లోకి తిరిగి ఎంటర్ అయిపోయారు. మొదటి షెడ్యూల్ కూడా పూర్తి కావోస్తోందని సమాచారం. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ పూర్తి స్తాయి మల్టీస్టారర్ లో నటించలేదు. వెంకటేష్ తో కలిసి నటించిన గోపాల గోపాల చిత్రంలో వెంకటేష్ పాత్రే ముఖ్యమైంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కనిపించేది తక్కువే.

మలయాళంలో సంచలన విజయం సాధించిన ఎ.కె చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేస్తుండగా తెలుగు రిమేక్ ని సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. సితార ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగావంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటె దీనికి సంబంధించిన మిగితా విషయాలు ఏవి బయటకు రాలేదు. రానా, పవన్ కళ్యాణ్ లకు జోడిలు ఎవరనేది ఇంకా అనౌన్స్ చేయలేదు చిత్ర బృందం. అయితే వస్తున్న కొన్ని కథనాల ప్రకారం రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ నటించనుందని టాక్. చిత్ర బృందం ఆమెను సంప్రదించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

అలాగే పవన్ కు జోడిగా నిత్య మీనన్ ను కన్ఫర్మ్ చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం ముందు ఆ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారని డేట్స్ కుదరకపోవడంతో ఆమె నో చెప్పిందని, దాంతో నిత్యా మీనన్ ను సంప్రదించగా ఆమె ఈ పాత్ర చేయడానికి ఒకే అన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమే అయితే చిత్ర బృందం అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి మరి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.