'డ్యాన్స్ ఐకాన్‌' అనే సరికొత్త షోతో వస్తున్నారు ఆహా, ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్ - 22 జూన్‌ నుంచి ప్రారంభం కానున్న ఆడిషన్స్!!

నెమలికి నేర్పిన నడకలివి అని ఆనాడు పాడిన, రారా రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్నా చావో రేవో తేలాలిపుడే డ్యాన్స్ అని ఈ మధ్య పాడినా, డ్యాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్‌ బయటికొస్తారు. మరి మీలో ఎవరైనా అలాంటి డ్యాన్సర్‌ ఉంటే, ఆ ప్రతిభ మీకుంటే ఆహా, ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో కలిసి సమర్పిస్తున్న 'డ్యాన్స్ ఐకాన్‌' అనే షో మీ కోసమే. మీ ప్రతిభకు మా వేదిక శిరస్సు వంచి ఆహ్వానిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఆడిషన్స్ ఇచ్చేయండి, డ్యాన్స్ ఐకాన్‌ టైటిల్‌ను గెలుచుకోండి.
జూన్‌ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ షో డిజిటల్‌ ఆడిషన్స్ జులై 10 వరకు కొనసాగుతాయి. మీ వయసు 5 నుంచి 50 మధ్యలో ఉన్నట్టయితే, మీరు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారైతే, మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.danceikon@oakentertainments.comఅనే ఈ మెయిల్‌కు, 60 సెకండ్స్ మీ డ్యాన్స్ వీడియోని మెయిల్‌ చేయండి.
ఈ షో యాంకర్‌, ప్రొడ్యూసర్‌ ఓంకార్‌ మాట్లాడుతూ ''ఈ షో ద్వారా నేను ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లోకి అడుగుపెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్‌గారికి, ఆహాకు ధన్యవాదాలు. నేను ఎన్నో డ్యాన్స్ షోస్‌ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఈ షో కంటెస్టంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్‌ చేసే మాస్టర్స్ జీవితాల్ని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌కు టాలీవుడ్‌లో ఒక పెద్ద హీరోకి నేను డ్యాన్స్ కొరియోగ్రాఫీ చేసే అవకాశం వస్తుంది. అది ఎవరు అని మేము ఫినాలేలో చెప్తాం. అందుకే ఈ షో మీ కోసమే. మీరు డ్యాన్స్ చేయగలరు అనుకుంటే తప్పకుండా ఈ షోలో పార్టిసిపేట్‌ చేయాలని కోరుకుంటున్నాను.''
ఇంకా ఎందుకు ఆలస్యం, మీ డ్యాన్స్ షూస్‌ వేసుకుని నచ్చిన పాటకి డ్యాన్స్ చేసి - డ్యాన్స్ ఐకాన్‌ అనిపించుకోండి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.