#SantaSam is here with a Mega Contest for the Mega Fans. Show your fandom and win exciting prizes.
— ahavideoIN (@ahavideoIN) December 18, 2020
👉 https://t.co/BCb98vnuCc
Megastar @KChiruTweets @Samanthaprabhu2 @thesamjamshow #SamJamMegaEpisode #SamJamOnAHA #SamJam pic.twitter.com/YZmPFnmr9P
పాపులర్ తెలుగు ఓ.టీ.టీ ‘ఆహా’ సమంతతో ఇటీవల ‘సామ్ జామ్’ పేరిట ఓ స్పెషల్ టాక్ షో
లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సమంత తనదైన స్టైల్లో పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ
చేస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు ఈ షో కి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్న సంగతి
తెలిసిందే. అయితే ఆహా ఓ.టి.టి తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మెగాస్టార్ కి సంబంధించిన ఒక
చిన్న కాంటెస్ట్ పెట్టారు. ఈ కాంటెస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని ప్రశ్నలు అడిగి అందులో
గెలిచిన వారికి ప్రైజెస్ ఇవ్వబోతున్నరు. ఇలా మెల్లగా సామ్ జామ్ షో లో వచ్చే చిరంజీవి గారి ఎపిసోడ్ కి
క్రేజ్ ని పెంచుతున్నారు. ఇప్పటికే పూర్తి అయిన చిరంజీవి గారి ఎపిసోడ్ వచ్చే క్రిస్టమస్ కి ఆహాలో స్ట్రీమ్
కాబోతుంది. ఇక ఈ షోలో చిరంజీవి గారి స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సామ్ జామ్
షో లో వచ్చే ఈ మెగా ఎపిసోడ్ ప్రోమో త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ ఎపిసోడ్ తో ఆహా ఓ.టి.టి
పాపులారిటీ మరింత పెరుగుతుందని ప్రేత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో
కూడా సమంత ఈ షో లో ఒక ఎపిసోడ్ చేయబోతోంది.