విజయ్ తరువాత రామ్ చరణే.. సుకుమార్ ఫుల్ బిజీ..!!

అల్లు అర్జున్ ప్రస్తుతం  లెక్కల మాస్టర్ సుకుమార్ తో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.. అలవైకుంఠపురం సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ నుండి రాబోతున్న ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నారు మెగా ఫాన్స్..

ఈ చిత్రం లుక్స్ ఇప్పటికే అదరగోట్టాయి..  తొలి చిత్రం నుంచి ఎంతో వైవిధ్యం చూపించే సుకుమార్ తన అన్ని సినిమాలతో ప్రేక్షకుల ఇంటలిజెన్స్ ను పరీక్షిస్తూనే ఉంటాడు.. ఎమోషన్స్ ని టెక్నికల్ గా వాడుకునే దర్శకుడుగా సుకుమార్ టాలీవుడ్ లో నిలిచిపోతాడు.. ఇకపోతే ఈ సినిమా తరవాత సుకుమార్ విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్నాడు. ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఈనేపథ్యంలో విజయ్ సినిమా తరువాత కూడా ఎం సినిమా చేయబోతున్నాడో అని అభిమానులు ఆరాతీస్తున్నారు. ఈనేపథ్యంలో రామ్ చరణ్ తోనే అయన నెక్స్ట్ సినిమా ఉంటుందని అంటున్నారు.  చరణ్ లైనప్ లో మరో టాలీవుడ్ టాప్ దర్శకుని పేరు కూడా ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు ఇదివరకే చరణ్ కు “రంగస్థలం” లాంటి భారీ హిట్ ఇచ్చిన ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ నే.. ఇప్పుడు చరణ్ లైనప్ లో ఈ దర్శకుని పేరు కూడా ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.