

అదితి రావు హైదరి ఎంపిక చేసుకునే తక్కువ దుస్తులు అయినా కూడా అవి తన అందాన్ని రెట్టింపు చేసేలా ఉంటాయి అని అనడానికి సందేహం లేదు. తన ప్రత్యేకమైన దుస్తుల ఎంపికతో అందరినీ ఆకర్షిస్తుంది, అలాగే ఆశ్చర్యపరుస్తుంది. ఆమె సినిమా ప్రమోషన్ల కోసం అయినా పండుగ కార్యక్రమాలలో అయినా, అదితి తన లుక్ తో అందరి కళ్ళనీ తనవైపు తిప్పించుకుంటుంది.
అదితి తన బూడిద-నీలం రంగు పఫ్ స్లీవ్డ్ క్రాప్ టాప్ అలాగే దానికి సరిపోయేలా ఫ్లేర్డ్ ప్యాంటుతో అందరి హృదయాలనీ కొల్లగొడుతోంది. ముల్ టాప్ దానికి తగిన నెక్లైన్ మరియు పఫ్ స్లీవ్లతో తన స్టైలిష్ స్టేట్మెంట్ చెప్పకనే చెప్పింది. వీటి అన్నిటికి ఆకర్షణగా ఆమె మెడపై బంగారు గొలుసు, డాంగ్లింగ్ చెవిపోగులు మరియు లేయర్డ్ మేకప్‌తో చాలా అందంగా కనిపించింది.