అదరగొట్టిన కమల్ ‘విక్రమ్’ సినిమా టీజర్

తన నటనతో అలాగే తన విభిన్నమైన చిత్రాల ఎంపికతో  భారతదేశం అంతా అభిమానులని సంపాదించుకున్న కమలహాసన్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టీజర్ ని అలాగే సినిమా టైటిల్ ని విడుదల చేసారు. విక్రమ్ పేరుతో వస్తున్న ఈ  సినిమాకి ఖైదీ సినిమా దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే చిత్రం టీజర్ లో  కమల్ హాసన్ గారు వంటని సిద్ధం చేస్తూ  అన్ని రకాల గన్స్ ని తన ఇంట్లో కనపడకుండా దాచిపెట్టి ఎవరి కోసమో ఎదురుచూస్తూ కనిపిస్తారు. అప్పుడే పోలీస్ వాహనాల సౌండ్ వినిపిస్తుంది. ముసుగులోతో తన ఇంట్లోకి వచ్చిన రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులకి భోజనం పెట్టి వాళ్ళమీద కత్తులు విసరడం తో టీజర్ ముగుస్తుంది. ఈ టీజర్ లో కమల్ హాసన్ గారి లుక్ అలాగే అనిరుద్ సంగీతం టీజర్ కి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ విక్రమ్ సినిమా పక్క యాక్షన్ ఎంటర్టైమెంట్ గా రాబోతుంది అని ఈ టీజర్ చూస్తేనే తెలుస్తుంది. కమల్ హాసన్ 232 వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని  కమల్ సొంత సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ద్వారా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. వచ్చే సమ్మర్ కి ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో కమల్ హాసన్ గారు ఎంత పెద్ద హిట్ కొడతారో తెలియాలంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.