డాక్టర్ రామ్ తో యాక్టర్ శ్రియ..!

అందాల తార శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతగా తన అందంతో అభినయంతో ప్రేక్షకుల్ని కటిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయినా ఇంకా ఆమె హీరోయిన్ గానే కొనసాగుతోందంటే ఆశ్చర్య పోనవసరం లేదు. పెళ్ళైన తర్వాత కొద్దిగా సినిమాలకు దూరమైన ఆమె మంచి కంటెంట్ ఉన్న కథలను ఒకే చేస్తోంది. ఇటీవలే గమనం సినిమాతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తన వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను పలకరిస్తూ ఉంటారు.

ఇక పెరుగుతున్న కరోన వ్యాప్తిపై అవగాహన పెంచేందుకు ఆమె ప్రముఖ డాక్టర్ పి.రఘురాం గారితో ముఖాముఖీలో పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిమ్స్ డైరెక్టర్ అయిన రఘురాం గారు బి.సి. రాయ్ అవార్డును కూడా పొందారు. లాక్ డౌన్ విధించిన వేళ చాలామందికి హాస్పిటల్స్ కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతోంది. అలాగే కరోన కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో హాస్పిటల్స్ లో బెడ్స్ సరిపోవట్లేదు. దీనిపై అవగాహన పెంచి ఇంట్లోనే సరియైన చికిత్సను తీసుకునే విధంగా తగు జాగ్రత్తలను ఆయన సూచించారు.

కరోన వచ్చిన రోగులు ముందుగా భయ పడకుండా ఉండాలని ఆయన అన్నారు. అలాగే వారు ఇంట్లో సెపరేట్ రూమ్ లో ఉండాలని, వారి వస్తువులను సెపరేట్ గా ఉంచుకోవాలని, సెపరేట్ బాత్ రూమ్ కూడా ఉండాలని ఆయన అన్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని శ్రియ అడగ్గా ఆయన ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు, విటమిన్ C ఎక్కువగా ఉండే పధార్థాలు తీసుకోవాలని, కార్బోహైడ్రేట్స్ అస్సలు తీసుకోకూడదని ఆయన అన్నారు. మెడిటేషన్, యోగా లాంటివి చేయడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం రాదనీ ఆయన అన్నారు. ఇక అందరం కలిసి కట్టుగా ఈ మహమ్మారిని ఎదురుకోవాలని వ్యాక్సిన్ వేయించుకోవాలనీ ఆయన ముగించారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.