
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోన గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఎంతోమంది సరైన సమయంలో ట్రీట్మెంట్ అందక ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది రోజు కూలీలకు ఉపాధి లేక వారికి తిండి కూడా దొరకడం లేదు. కరోన పేషంట్లకి కూడా సరైన ఆహారం దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ముందుకి వచ్చి వలస కార్మికులకు, రోజు కూలీలకు ఆహారం అందించేందుకు ముందుకు వస్తున్నారు.
2 వ వేవ్ సమయంలో,ఎక్కువ కుటుంబాలు ఆకలితో పోరాడుతున్నాయి.కేవలం రూ.40, మీరు రోటీ బ్యాంక్ మరో ఆకలితో ఉన్న కడుపుని తిండికి సహాయం చేయవచ్చు.రోటీ బ్యాంక్ చేస్తున్న అద్భుతమైన పనికి నేను మద్దతు ఇస్తున్నాను & మీకు వీలైతే,pls వారికి కూడా మద్దతు ఇస్తుంది.#bethemiraclehttps://t.co/8f8GYXv4qN pic.twitter.com/0woqluAhGZ
— Raashii Khanna (@RaashiiKhanna_) June 8, 2021
ఈ నేపధ్యంలో అందాల తార రాశి ఖన్నా అలాంటి వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. “సెకండ్ వేవ్ సమయంలో ఎకువ కుటుంబాలు ఆకలితో పోరాడుతున్నాయి. కేవలం 40 రూపాయలతో మీరు రోటి బ్యాంక్ ద్వారా ఆకలితో ఉన్న మరో కడుపుని నింపడానికి మీరు సహాయ పడవచ్చు. రోటి బ్యాంక్ చేస్తున్న అద్భుతమైన పనికి నేను మద్దతు ఇస్తున్నాను. మీకు వీలైతే మీరు దయచేసి వారికి హెల్ప్ చేయండి” అని ఆమె అన్నారు.

ప్రస్తుతం రాశిఖన్నా చేతిలో ఎప్పుడూ లేనన్ని సినిమాలు ఉన్నాయి. 5 తమిళ చిత్రాలు, రెండు తెలుగు చిత్రాలు ఒక మలయాళ చిత్రం ఆమె చేస్తోంది. ఇందులో క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్ యు, కార్తి కథానాయకుడిగా తెరకెకుతున్న సర్దార్ చిత్రాలపై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి.