నటి మన్నారా చోప్రా తాజ్ కృష్ణలో సూత్ర ఫ్యాషన్ & లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు హైదరాబాద్ నగరంలో సూత్ర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ !
సూత్ర ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌తో నవంబర్ నెలలో ఫ్యాషన్ మరియు వివాహ వేడుకల సంబరం
నవంబర్ 15–17 , 2022 మధ్య మూడు రోజుల పాటు తాజ్‌కృష్ణా హోటల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ జరిగే ఈ ప్రదర్శనలో 80మంది డిజైనర్లు పాల్గొననున్నారు
సూత్ర తో భారతీయ డిజైనర్ల క్లాతింగ్, యాక్ససరీలు, డెకార్‌ను మీ నగరంలో కొనుగోలు చేయండి. విభిన్న విభాగాలకు చెందిన డిజైనర్లతో సూత్ర వచ్చింది. వీరంతా కూడా విస్తృత శ్రేణి ఉత్పత్తులను ఒకే చోటకు తీసుకువచ్చారు. మీరు ఎవరనేది మీరు మాట్లాడకుండానే చెప్పేది మీ శైలి మాత్రమే !
దేశంలోని పలు ప్రాంతాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన నిత్యావసర వస్తువుల శ్రేణితో పాటుగా అత్యుత్తమ ఆభరణాల సంస్ధల నుంచి ఆకట్టుకునే అలంకరణ డిజైన్లు, అత్యద్భుతమైన ఆభరణాల నుంచి ఎంపిక చేసిన కలెక్షన్‌తో ప్రత్యేకంగా మిమ్మల్ని ఆకట్టుకోవడానికి సూత్ర సిద్ధమైంది. ఈ ఆభరణాలతో పాటుగా ఇతర నిత్యావసరాలు భారతీయ సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్లడంతో పాటుగా మీ పండుగ వస్త్రధారణను అత్యుత్తమంగా మారుస్తుంది. నేటి తరపు మహిళల అవసరాలను తీర్చే రీతిలో అలా్ట్ర మోడ్రన్ స్ఫూర్తిని జొప్పిస్తూ డిజైనర్లు ఈ కలెక్షన్ తీర్చిదిద్దారు.
కళాత్మకమైన ఆభరణాలు అత్యంత సౌకర్యవంతంగా విలాసాన్ని, సరళతతో మిళితం చేయడంతో పాటుగా కాలాతీత, హస్తకళా వైభవాన్ని రూపొందించడానికి కట్టుబడింది. ఆఫ్‌బీట్ డిజైన్లతో విభిన్నమైన రంగులు మిళితం చేయడంతో పాటుగా అత్యద్భుతమైన డిజైన్లను తీర్చిదిద్దారు. సూత్ర ప్రదర్శనలో పాల్గొంటున్న డిజైనర్లలో ...
• షాజ్ క్రియేషన్
• రీన్స్
• స్టైలో మోడ్
• హర్ష్ డిజైనర్ బొటిక్
• విహానా ఫ్యాషన్స్
• సాన్వీ బై శ్రద్ధ
• అపూర్వ
• యుగముగి సిల్క్ హౌస్
• ఏఎం క్లాతింగ్
• బాబీ బై అలియా
• దీపాలీ వోరా
• ఉత్తర క్రియేషన్స్
• మనషా సోనీ
• లేబల్ ఏఎస్
• శ్రీకళ
• ట్రెడిషనల్ టెంప్టేషన్స్
• పీచ్ టస్సెల్స్
కాలాతీత వారసత్వం మరియు అంతకుమించిన విలాసవంతమైన కొటూర్ ట్రెండ్స్ యొక్క కళాత్మక వైభవాన్ని సూత్ర తీసుకువస్తుంది. ఈ కలెక్షన్ శాశ్వత వారసత్వాన్ని ఉత్తేజపరచడం మాత్రమే ఈ వేడుకల సీజన్‌కు సరైన ఎంపికగానూ నిలుస్తుంది. అందమైన ఎన్సెంబల్స్, ప్రేమతో డిజైన్ చేయబడటంతో పాటుగా మిమ్మల్ని అత్యంత అందంగా తీర్చిదిద్దుతుంది. దేశవ్యాప్తంగా సుప్రసిద్ధ డిజైనర్లను ఒకే చోట తీసుకురావడం వల్ల మీరు మీ మనసుకు నచ్చిన అంశాలన్నీ ఒకే చోట కనుగొనండి. సౌకర్యం మరియు అందం కనుగొనాలనుకునే వారికి ఖచ్చితమైన పండుగ వస్త్ర శ్రేణిగా ఇది నిలుస్తుంది.
ప్రతి ప్రత్యేక సందర్భానికీ సరిగ్గా సరిపోయే రీతిలో ఉండే సూత్ర ఎగ్జిబిషన్ ద్వారా పాశ్చాత్య డిజైనర్ల కలెక్షన్నూ సొంతం చేసుకోండి. మహిళలు ఇష్టంగా ఎంచుకునే సంప్రదాయ వస్త్ర శ్రేణిలో భాగంగా విస్తృత శ్రేణిలో కుర్తీలు ఇక్కడ ఉంటాయి. పండుగ సీజన్లో వాటిని ధరించడం మాత్రమే కాకుండా ఈ విలాసవంతమైనప్పటికీ, సింపుల్‌గా ఉండే ఈ వస్త్రాలను మహిళలు ప్రతి రోజూ కూడా వాడవచ్చు.
దేశంలోని పెద్ద నగరాలలో ఫ్యాషన్‌ను ప్రమోట్ చేస్తోంది సూత్ర ఎగ్జిబిషన్. ఈ నగరాల్లో లక్నో, నాగ్‌పూర్, రాంచి, హైదరాబాద్ , ఇండోర్, రాయ్‌పూర్, గౌహతీ, పాట్నా, భుబనేశ్వర్, బెంగళూరు, కాన్పూర్, అహ్మదాబాద్, సూరత్ మొదలైనవి ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా 400 కు పైగా షోస్‌ను ఇది చేసింది.