స్టాలిన్ ను కలిసిన సూర్య, కార్తి. డబ్బులు ఇచ్చిందే అందుకే.!

కరోన వల్ల పరిస్థితి రోజురోజుకీ మరింత దుర్భరంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రావట్లేదు. కేసులు కూడా రోజులు మరే కొద్ది రెట్టింపు అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో అయితే డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉంటోంది. తమిళనాడులో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కరోనాని కట్టడి చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా దాన్ని ఏమాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సహాయంగా ఉండేందుకు స్టార్ హీరోలు ముందుకు వస్తున్నారు. తమవంతుగా ఎంతోకొంత ఎవరికో ఒకరికి సహాయం చేస్తున్నారు.

ఈ కోవలోనే తమిళ స్టార్ హీరోలు అన్నదమ్ములైన సూర్య, కార్తీలు తమవంతు సహాయంగా కోటి రూపాయలను సి.ఎం సహాయ నిధికి అందజేశారు. ఇటీవలే తమిళనాడులో స్టాలిన్ సారధ్యంలోని డి.ఎం.కె పార్టి విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. స్టాలిన్ తో పాటు ఆయన కుమారుడు ఉధయనిది స్టాలిన్ కూడా ఎం.ఎల్.ఎ గా పోటి చేసి గెలిచిన విషయం తెలిసిందే. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు సూర్య ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సూర్య, కార్తిలు స్టాలిన్ గారిని ఆయన ఆఫీస్ లో కలిసారు. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి పుష్ప గుచ్ఛం అందజేశారు.

అలాగే కోటి రూపాయల చెక్ ను ఆయనకు అందజేసిన వారు పరిశ్రమను డెవలప్ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు సమాచారం. స్టాలిన్ కూడా వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అన్నదమ్ములు ఇద్దరూ కోటి రూపాయలను విరాళంగా అందజేసి తమ గోప్ప మనసు చాటుకున్నారు. ప్రస్తుతం సూర్య చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా, వెట్రిమారన్ దర్శకత్వంలో మరో సినిమా లైన్ లో ఉంది. ఇటు కార్తి కూడా సర్దార్ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.