
ఇటీవల తమిళనాట జరిగిన ఎన్నికల్లో డి.ఎం.కె పార్టి భారి మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఎవరెన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారు డిఎంకె అధినేత స్టాలిన్. ఆయన గెలిచిన దెగ్గర నుండి చాలామంది ఆయన్ను కలిసి అభినందిస్తున్నారు. రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీనికి కారణం ఆయన కుమారుడు ఉధయనిది స్టాలిన్. ఉధయనిది స్టాలిన్ తమిళంలో యువ కథానాయకుడిగా మంచి ఫాంలో ఉన్నాడు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటి చేసి గెలుపొందారు. ఆయనకు కూడా సినీ ప్రముఖుల నుండి అభినందనలు వస్తున్నాయి. ఇటీవలే తమిళ స్టార్ హీరో విశాల్ వెళ్ళి వారిని అభినందించారు. విశాల కి ఉధయనిది స్టాలిన్ మంచి స్నేహితుడు. సినిమాల పరంగా కూడా విశాల్ అతనికి ఎన్నో సార్లు సహాయపడ్డాడు. అయితే పరిశ్రమలో ఉన్న స్టాలిన్ కుమారుడు గెలవడం, వారి పార్టి అధికారంలోకి రావడం పరిశ్రమకు దోహదపడుతుందని పరిసరం వర్గాలు అంటున్నాయి.

ఇక విశాల్ రీసెంట్ గా తన కొత్త సినిమాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతోంది. మ్యూజిక్ మెజీషియన్ యువన్ శంకర్ రాజ సంగీతం అందిస్తున్నారు, బాల సుబ్రమణియన్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. డింపుల్ హయతి విశాల్ కు జోడిగా నటిస్తోంది. ఇక సినిమాకి సంబంధించిన మిగితా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.