పాతిక వేలమందికి మనోజ్ సహాయం..!

మంచు మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అలాగే అవసరాల్లో ఉన్న అభిమానులకి సహాయం కూడా చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో కరోనా భాదితులకి ఆయన చేయూతనిస్తున్న విషయం తెలిసిందే. ట్విటర్ లో ఆయన్ని ట్యాగ్ చేసి ప్రాబ్లమ్ ఏంటో చెబితే వెంటనే స్పందిస్తున్నారు. ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. అభిమానులు, సన్నిహితుల సహాయంతో సుమారు పాతికవేల మందికి పైగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. మే 20న 38వ పడిలోకి అడుగుపెట్టిన ఆయన తన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యాన్ని మొదలుపెట్టారు.

‘‘కోవిడ్‌ భాదితులు మెరైగన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలను పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో పాటుగా కోవిడ్‌ కట్టడిలో భాగస్వామ్యులైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

మాస్కులు ధరించడం, ప్రతిరోజు శానిటైజ్‌ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం..ఇలా కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్‌ మహమ్మారినుంచి భయటపడుతుంది. నా పుట్టినరోజు సందర్భంగా ఈ లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందిపడుతున్న పాతికవేల కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సహాయాలను కొనసాగిస్తాం. దయచేసి అందరు ఇంట్లోనే ఉడండి. కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించండి. పాజిటివ్‌గా ఉండండి కానీ కోవిడ్‌ పాజిటివ్‌ తెచ్చుకోకండి’’

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.