జగ్గు భాయ్ కొత్త లుక్ అదుర్స్..!

జగపతిబాబు గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయనకున్న లేడీ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. నాన్నకు ప్రేమతో, అరవింద సమేత సినిమాల్లో విలన్ గా, శ్రీమంతుడు, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల్లో తండ్రిగా తన నటనతో సెపరేట్ మార్క్ క్రియేట్ చేసారు. ఆయన హీరోగా ఉన్నప్పుడు ఎంత బిజీగా ఉన్నారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ బిజీగా గడుపుతున్నారు.

ప్రస్తుతం ఆయన చేతిలో దాదపు 10 చిత్రాలు ఉన్నాయి. వాటిలో 7 తెలుగు చిత్రాలు కాగా, మూడు తమిళ చిత్రాలు. ఇప్పుడు ఆయన కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా ఆయన పెట్టిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. కురచ జుట్టు, కొద్దిగా నెరిసిన గడ్డంతో స్టైలిష్ గా ఉన్నారు. ఈ పిక్ షేర్ చేస్తూ నా ఫ్యూచర్ కెరీర్ లుక్ అని పోస్ట్ చేసారు. అయితే ఈ పిక్ తో ఆయన మరిన్ని సంచలనాలకు తెర తీసారు. నా కెరీర్ లుక్ అని పెట్టాడంటే ఆయన చేయబోయే తదుపరి సినిమాలోని పాత్ర తాలుకూ లుక్ అయి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు అగ్ర కథానాయకుల్లో ఒకడిగా వెలుగొంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మోస్ట్ వాంటెడ్ లిస్టు లో ఉన్న నటుడు ఆయన. హీరోగా ఉన్నప్పుడు ఆయన చాలా నష్టపోయారు. వరస ఫ్లాపులు, ఫాలోయింగ్ తగ్గిపోవడంతో ఆయన మార్కెట్ కూడా పడిపోయింది. అలాంటి సమయంలో ఆయన పోషించిన లెజెండ్ సినిమాలో జితేంద్ర పాత్ర ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత ఆయన తెలుగులో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా ఎదిగిపోయారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.