
మెగా స్టార్ చిరంజీవి గారు సినీ కార్మికులకి వ్యాక్సిన్ వేయిస్తున్న సంగతి తెలిసిందే. అపోలో హాస్పిటల్స్ సహకారంతో ఈ కార్యాన్ని ఆయన చేయబూనారు. 45ఏళ్ళు దాటినా ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేయిస్తున్నారు. అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ కి అర్హులే. 45 సంవత్సరాలు దాటిన వారెవరైనా తమకు సంబంధించిన ఆధారాలను చూపించి వ్యాక్సిన్ ను ఉచితంగా పొందవచ్చు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ రోజు విజయవంతంగా మొదలైంది. నేటి నుండి ఈ వ్యాక్సిన్ డ్రైవ్ అందుబాటులో ఉంటుంది.
Starting today #CoronaCrisisCharity (CCC) in collaboration with #Apollo247 & #ChiranjeeviCharitableTrust has commenced vaccination programme for Telugu film industry workers of 24 crafts, #MovieArtistsAssociation & #FilmJournalistsUnion pic.twitter.com/LtCcakmjgq
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 7, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తో ఫిల్మ్ జర్నలిస్ట్స్ కూడా ఈ వ్యాక్సిన్ కి అర్హులే. ఈ వ్యాక్సిన్ పొందాలనుకునే వారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, లేదా కరోన క్రైసిస్ చారిటి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చిరంజీవి గారు చేస్తున్న ఈ పనికి అందరి నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాక్సిన్ డ్రైవే కాకుండా ఇటీవలే ఆయన ఆక్సిజన్ సిలిండర్స్ కూడా సప్లై చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ చోట్ల ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి టాలివుడ్ కు పెద్ద దిక్కులా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఎవరికి ఎలాంటి అవసరం ఉందని తెలిసిన వెంటనే స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆచార్య చిత్రంతో పాటు మరో మూడు చిత్రాలను లైన్ లో పెట్టారు. కరోన కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ అయిన తర్వాత తిరిగి షూటింగ్స్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.