‘వసంత కోకిల’ సెట్స్ లో బాబీ సింహా, కాశ్మీరా ఫన్ టైమ్

Here are the Exclusive Shooting spot stills from the sets of #VasanthaMullai #VasanthaMullaiStills @Actorsimhaa...

Posted by Bobby Simha on Tuesday, November 17, 2020

పిజ్జా, సూదు కవ్వం, జిగర్తాండ, వంటి విభిన్న చిత్రాలలో నటించిన నటుడు బాబీ సింహ. అసలు పేరు జయ సింహ పుట్టింది. హైదరబాద్ లోనే, తెలుగులోనే చదువుకున్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలి చెన్నై కి వెళ్ళి స్థిరపడింది. తమిళంలోనే నటుడుగా తన సినీ ప్రస్థానాన్ని మొదలెట్టారు. అతను నటించిన సినిమాలు తెలుగులో కూడా పాపులర్ అయ్యాయి. తెలుగులో రవితేజ నటించిన ‘డిస్కోరాజా’ సినిమాలో విలన్ గా నటించారు. అయితే తాజాగా బాబీ సింహ ‘వసంత ముల్లై’ అనే సినిమాలో నటిస్తున్నారు. కాశ్మీర పర్దేశి కథానాయకిగా. తెలుగులో ఈ సినిమా ‘వసంత కోకిల’ అనే పేరుతో వస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ని నటుడు రానా దగ్గుబాటి ఆవిష్కరించారు.  ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్ మరియు ముద్ర ఫిల్మ్ ఫాక్టరీ బ్యానర్స్ పై రామ్ తళ్ళూరి, రేష్మీ సింహా కలసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. బాబీ సింహ, కాశ్మీర కలిసి సెట్ లో రిలాక్స్ అవుతున్న ఫోటోలను “ఎక్స్ క్లూజివ్ షూటింగ్ స్పాట్ స్టిల్స్ ఫ్రం ద సెట్స్ ఆఫ్ వసంత ముల్లై” అని పేర్కొంటూ బాబీ సింహ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో బాబీ సింహ, కాశ్మీరా టీ తాగుతూ సరదగా సెట్ లో ఖాళీ టైమ్ ని ఇలా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి రామనన్ పురుషోత్తం దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ మురుగేశన్ సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.