లాక్ డౌన్ లోనూ ఆగని ఆచార్య.. ఫైనల్ షెడ్యూల్ ప్లాన్..!!

మెగా స్టార్  కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా లో నటిస్తుండగా ఆ సినిమా తరువాత మరో మూడు సినిమాలను చిరంజీవి ఒప్పుకొని యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత మోహన్ దర్శకత్వంలో  రీమేక్ సినిమాని చిరంజీవి చేస్తుండగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా, బాబీ దర్శకత్వంలో ఇంకో సినిమా చిరంజీవి చేస్తున్నారు..  ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఓ కీలక పాత్రలో పోషిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

మణిశర్మ సంగీత సారధ్యం వహిస్తూ ఉండగా ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పాట కు మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమా షూటింగు ఇంకా 20 రోజుల పాటు జరగవలసిన సమయంలో, కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆగిపోయింది. అప్పటి నుంచి కూడా ఆ కాస్త షూటింగు పూర్తి చేయడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు.

'కోకాపేట'లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో 20 రోజుల పాటు షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చిరంజీవి .. చరణ్ .. సోనూ సూద్ కాంబినేషన్లో సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట. ఆ సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేయనున్నారు. జులైలో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసి, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ కి వెళ్లనున్నారని అంటున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.