
చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ 12 రోజులయితే పూర్తి అవుతుందట. ఈమేరకు ఈ విషయాన్నీ చిత్ర బృందం ప్రకటించింది.. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావలసి ఉండగా కరోనా కారణంగా ఆగిపోయింది.. ప్రస్తుతం పరిస్థితులు నార్మల్ అయినా నేపథ్యంలో షూటింగ్ స్టార్ట్ చేసుకోగా మరో 12 రోజుల షెడ్యూల్ పూర్తి అయితే ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవనుందని చెబుతున్నారు.

మరోవైపు సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్టు కొరటాల శివ ప్రకటించారు. దీనికి వివరణను కూడా ఆయన ఇచ్చారు. 'ఆచార్య' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాను వెంటనే ప్రారంభించాల్సిన పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. ఈ సినిమాల ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తాను చాలా బిజీగా ఉన్నానని... అందువల్ల సోషల్ మీడియాకు సమయాన్ని కేటాయించలేకపోతున్నానని అన్నారు.

అయితే మీడియా ద్వారా సినీ అభిమానులకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇక రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లో కాజల్ , పూజ హెగ్డే లు కథానాయికలు గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.. ఇప్పటికే ఓ పాట విడుదలై ప్రేక్షకుల్లో మంచి స్పందన దక్కించుకుంది.