
ఎయిర్‌డెక్కన్ అధినేత జి.ఆర్.గోపీనాథ్ జీవితం ఆధారంగా సూర్య హీరోగా మోహన్‌బాబు, అపర్ణా బాలమురళీ ముఖ్య పాత్రదారులుగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూరరై పోట్రు’. ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో అమెజాన్ ప్రైమ్ విడుదలవుతుంది. అక్టోబర్ 30న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. దినివలన మొదట్నించి తన కెరీర్‌కు అండగా ఉన్న అభిమానులతో ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు సూర్య. 'ఈ సినిమా వైమానికరంగం నేపథ్యంలో జరిగే కథ అని తెలిసిందే. నిజమైన ఇండియన్ యుద్ధవిమానాలు, సెక్యూరిటీతో డీల్ చేయాల్సి వచ్చింది. నో అబ్జక్షన్ సర్టిఫికెట్ లు ఇంకా రావలసి ఉంది.
From us to you, an ode to never-ending support and friendship https://t.co/5KuqtOfX7J#SooraraiPottruOnPrime@primevideoin #SudhaKongara @gvprakash @2D_ENTPVTLTD@rajsekarpandian pic.twitter.com/c447emLnyf
— Suriya Sivakumar (@Suriya_offl) October 22, 2020
అందుకే కొన్ని అనుమతుల కోసం ఇంకా సమయం పట్టేలా ఉంది. సినిమా విడుదలయ్యేలోపు ట్రైలర్‌ను, ఈ లెటర్‌తో పాటు మన స్నేహం, ప్రేమానురాగాలకు గుర్తుగా ఫ్రెండ్షిప్ సాంగ్‌ను అందిస్తున్నాను’’ అని అన్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. కాటుక కనులే పాట అందరి కాలర్ ట్యూన్ గా, వాట్సాప్ లలో సందడి చేస్తోంది. తెలుగులో డైరెక్టర్ సుధ కొంగర వెంకటేష్ గారితో తీసిన ‘గురు’ సినిమా మంచి విజయం సాధించింది దానితో ఇటు తెలుగులోను అటు తమిళ్ లోను ఆకాశం నీ హద్దురా సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. కొత్త కొత్త కథలని ప్రోత్సహించే సూర్య ఈ చిత్రాన్ని నిర్మించడం ఇంకో విశేషం .కానీ వాయిదా పడిన ఈ సినిమా మళ్ళీ ఎప్పడు విడుదల చేస్తారో తేదీ ని సూర్య తన లేఖ లో పంచుకోలేదు.