‘నేను సూపర్ ఉమెన్‌’ అంటూ ఆడవాలకోసమే రాబోతోన్నో ‘ఆహా’ యొక్క బిజినెస్ రియాల్టీ షో!!

హైద్రాబాద్‌, జనవరి 27 : మహిళా వ్యాపారవేత్తలకు తమ తమ ఆలోచనలు పంచుకునేందుకు, తమ ప్రయాణం గురించి చెప్పుకునేందుకు సరైన వేదికను ఆహా ఏర్పాటు చేస్తోంది. మొదటి సారిగా మహిళా వ్యాపారవేత్తల కోసం 'నేను సూపర్ ఉమెన్' అనే రియాల్టీ షోను ఆహా టీం ప్లాన్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రియాల్టీ షో కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉండబోతోంది.

నిస్సందేహంగా, మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ప్రోత్సాహ౦ అందిచండం వల్లన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మెరుగ్గా ఉంటుంది, కానీ  సామాజిక-ఆర్థిక కారణాల వల్ల వారు తరచుగా వెనుకబడి ఉంటారు. ఆహా యొక్క 'నేను సూపర్ ఉమెన్' మహిళా వ్యాపారవేత్తలకు కోసం ఈ షో ని ప్రతేయకంగా తీసుకువచ్చింది. మీ దగ్గర ఒక మెరుగైన వ్యాపార ఆలోచనలు, వ్యాపార ప్రొటోటైప్ లేదా లేదా బిజినెస్ చేస్తున్న, అవని కూడా పరిశీలిస్తారు మన 'ఏంజెల్స్'

నేను సూపర్ ఉమెన్‌లో పాల్గొనే వారికి దిశానిర్దేశం చేసేందుకు ప్రముఖ వ్యాపారవేత్తలను 'ఏంజెల్స్' గా అందరి ముందుకు తీసుకొని వచ్చింది ఆహ.

Link - https://www.youtube.com/watch?v=NypNV5QLeyw

A person sitting on a purple chair

Description automatically generated with medium confidence

డార్విన్ బాక్స్ కో ఫౌండర్ రోహిత్ చెన్నమనేని ఈ షోలో కనిపించనున్నారు. ఆయన ఐఐఎం లక్నో నుంచి వచ్చి డార్విన్ బాక్స్ కో ఫౌండర్‌గా ఎదిగారు. అంతేకాకుండా సాస్‌భూమిని కూడా డెవలప్ చేశారు. సరికొత్త ఆలోచనలతో రాబోయే వారిని ప్రోత్సహించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు సైతం సిద్దంగా ఉన్నారు.

Link - https://www.youtube.com/watch?v=tLVYat6Ega4

A person in a red coat

Description automatically generated with low confidence

ముద్ర వెంచర్స్‌ స్థాపకురాలు స్వాతి రెడ్డి గునుపాటి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. ఆమె ముద్ర వెంచర్స్‌లో భాగంగా డిఫెన్స్, ఆరోగ్యం, ఆహారం, వినోద రంగంలో రకరకాల పెట్టుబడులు పెడుతూ సక్సెస్‌ఫుల్ అవుతున్నారు.

Link - https://www.youtube.com/watch?v=2hTL4SgfdTw

A person in a suit

Description automatically generated with low confidence

ప్రముఖ వ్యాపారవేత శ్రీధర్ గది 2015లో క్వాంటేలా ఇంక్ అనే సంస్థను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆ సంస్థను టాప్ ప్లేస్‌లోకి తీసుకొచ్చారు. స్మార్ట్ సిటీ సొల్యూషన్‌లో భాగంగా మార్కెట్ లీడర్లలో సింపుల్ డ్యాష్ బోర్డ్‌ కంపెనీగా క్వాంటెలా ఇంక్ నిలిచింది.

Link - https://www.youtube.com/watch?v=MEMmi2_uDls&t=1s

A picture containing text, person, outdoor

Description automatically generated

సిల్వర్ నీడిల్‌ వెంచర్స్‌ యొక్క వెంచర్ పార్టనర్ రేణుక బొడ్ల ఐఐఎం కలకత్తా నుంచి పట్టభద్రురాలయ్యారు. నోవార్టిస్ బియోమ్ ఇండియాకు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఒరాకిల్, సిస్కో, జీఈ, నోవార్టిస్ వంటి వాటిలో ఇరవైఏళ్లుగా స్టింట్‌గా పని చేసిన తరువాత సిల్వర్ నీడిల్‌ వెంచర్స్‌లో జాయిన్ అయ్యారు.

Link – https://www.youtube.com/watch?v=Mk1tc8UsHDI

A person sitting in a car

Description automatically generated with medium confidence

అభి బస్ ఫౌండర్ అండ్ సీఈఓ సుధాకర్ రెడ్డి ఓ సంచలనం సృష్టించారు. బస్ టికెట్ యాప్స్‌లో అభి బస్ ఎంతటి వృద్దిని సాధిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ పదమూడేళ్లలో దాదాపు 200 మిలియన్ యూఎస్ డాలర్ల వ్యాపారం జరిగింది. అభి బస్ అనేది దాదాపు 3500 ప్రైవేట్, పబ్లిక్ రవాణా సంస్థలతో కలిసి పని చేస్తోంది. నెలకు ఇంచు మించుగా రెండు మిలియన్ల సీట్లు బుక్ అవుతాయి. ఆయన ఈ సంస్థను లెక్సిగో గ్రూపులో విలీనం చేశారు. ఆ తరువాత ఫ్రెష్ బస్ అనే కొత్త వెంచర్‌ను ప్రారంభించారు. మద్రాసులోని అన్నా యూనివర్సిటీలో సుధాకర్ రెడ్డి చదువుకున్నారు.

మీరు కూడా మీ వ్యాపార ఆలోచనలను పంచుకునేందుకు ఈ రియాల్టీ షోలో పాల్గొనేందుకు ఇలా చేయండి..

స్టెప్ 1- ఆన్ లైన్ అప్లికేషన్

https://tally.so/r/wvXg4D లింక్‌ను ఓపెన్ చేయండి. నియయ నిబంధనలు పాటిస్తూ అందులోని ఫాంను నింపండి. మీ బిజినెస్ ఐడియాలను అక్కడ రాయండి. అవి ఎందుకు అంత ప్రత్యేకం, పెట్టుబడులు పెట్టేంత విషయం ఏముందో కూడా వివరించండి. ఓ నిమిషం నిడివి గల వీడియోను కూడా పంపండి.

స్టెప్ 2- ఆన్ లైన్ ట్రైనింగ్

ఈ దశలో అభ్యర్థులను వర్చువల్‌గా ట్రైన్ చేస్తారు. నేను సూపర్ ఉమెన్ టీం మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తుంది. ఎకనామిక్స్, ఆపరేషన్స్, ఫైనాన్స్, స్ట్రాటజీల వంటి విషయంలో టీం సలహాలు, సూచనలు ఇస్తుంది.

స్టెప్ 3- ఇన్ పర్సన్ మెంటర్‌షిప్

ఎంపికైన అభ్యర్థులు మెంటర్స్‌ను కలిసి మాట్లాడాల్సి ఉంటుంది. వారి వారి వ్యాపార ఆలోచనలు, కొత్త ఐడియాలను వ్యక్తపరచాలి.

స్టెప్ 4- ఫైనల్ పిచ్ ఆన్ ది షో

నలభై మంది అభ్యర్థులను ఎంచుకుంటారు. ఇందులోనే వారంతా కూడా ఇన్వెస్టర్లతో తమ తమ ఆలోచనలు, కొత్త ఐడియాలను పంచుకుంటారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని వీ హబ్, గ్రూప్ ఎం, ఆహా కలిసి నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తులకు ఆహ్వానం.

త్వరలోనే నేను సూపర్ ఉమెన్ అనే షో ఆహాలో రాబోతోంది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.