ఆగ‌స్ట్ 15న రానున్న కీర్తి సురేష్ 'గుడ్‌ల‌క్ స‌ఖి' టీజ‌ర్

ఆగ‌స్ట్ 15న రానున్న కీర్తి సురేష్ 'గుడ్‌ల‌క్ స‌ఖి' టీజ‌ర్‌

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ 'గుడ్‌ల‌క్ స‌ఖి'. ఎక్కువ‌గా మ‌హిళ‌లే ప‌నిచేస్తున్న ఈ చిత్రానికి శ్రావ్య వ‌ర్మ స‌హ నిర్మాత‌.

న‌గేష్ కుకునూర్ డైరెక్ట‌ర్ చేస్తోన్న ఈ సినిమా ఏక కాలంలో తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో నిర్మాణ‌మ‌వుతోంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పిస్తున్న ఈ మూవీని వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న ఉద‌యం 10 గంట‌ల‌కు 'గుడ్‌ల‌క్ స‌ఖి' టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువ‌తిగా క‌నిపిస్తున్నారు.

స్పోర్ట్స్ రామ్ కామ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ షూట‌ర్‌గా న‌టిస్తున్నారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్రసాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

ఒక చిన్న షూటింగ్ షెడ్యూల్ మిన‌హా మిగ‌తా ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి.

ప్ర‌ధాన తారాగ‌ణం:
కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు

సాంకేతిక బృందం:
మ్యూజిక్‌:  దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ:  చిరంత‌న్ దాస్‌
స‌హ నిర్మాత‌: శ‌్రావ్య వ‌ర్మ‌
స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
నిర్మాత‌:  సుధీర్‌చంద్ర పాదిరి
ద‌ర్శ‌క‌త్వం: న‌గేష్ కుకునూర్‌
బ్యాన‌ర్‌: వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్‌


Keerthy Suresh’s Sakhi Teaser Will Be Out On August 15th

Good luck Sakhi is a woman-centric film where Keerthy Suresh is playing the title role. The film boasts proudly of a female dominated crew lead by co-producer Shravya Varma.

Directed by Nagesh Kukunoor, Sakhi is a multi-lingual film being made simultaneously in Telugu, Tamil and Malayalam languages.

Popular producer Dil Raju is presenting the film while Sudheer Chandra Padiri is producing it on Worth A Shot Motion Arts banner.

The makers have announced to release the film’s teaser at 10 AM on August 15th as Independence Day special. The poster sees Keerthy Suresh as a rural girl dancing in her element .

Aadhi Pinisetty and Jagapathi Babu are the other prominent cast in the Sports rom com  backdrop . Keerthy Suresh will be seen as a shooter.

Rock star Devi Sri Prasad is scoring music while Chirantan Das is cranking camera.

Except for a small shooting schedule, all the production works have been completed. Post-production works are in finishing stages .

Cast: Keerthy Suresh, Aadhi Pinishetty, Jagapathi Babu and others.

Technical Crew:
Director: Nagesh Kukunoor
Presented by: Dil Raju (Sri Venkateswara Creations)
Banner: Worth A Shot Motion Arts
Producer: Sudheer Chandra Padiri
Co-Producer: Shravya Varma
Music Director: Devi Sri Prasad
Cinematographer: Chirantan Das

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.