
రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ లలో ఒకటి ఆదిపురుష్ ఒకటి.. సాహూ రిలీజ్ అయ్యి చాల రోజులే అవుతున్నా ప్రభాస్ నుంచి ఎటువంటి సినిమా రిలీజ్ కి నోచుకోలేదు.. అందరు సినిమా లు నెలల్లో చేసి రిలీజ్ చేస్తుంటే ప్రభాస్ మాత్రం సంవత్సరాల తరబడి సినిమాలు చేయడం ఎవరికీ నచ్చడంలేదు. ప్రభాస్ చేతిలో సినిమాలు అయితే బాగానే ఉన్నాయి కానీ రిలీజ్ ఎప్పుడవుతాయో అన్న పరిస్థితి మాత్రం ఎవరికీ తెలీట్లేదు. రాధేశ్యామ్ మాత్రం జులై 30 న రిలీజ్ అవుతుంది.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకున్న విషయం తెలిసిందే.
రాధే శ్యామ్ సినిమా తర్వాత సలార్ సినిమా రాబోతుంది. ఈ సినిమా ఇటీవలే ఘనంగా ప్రారంభమవగా ఈ కెర్యక్రమానికి యష్ ముఖ్య అతిధిగా వచ్చాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని దసరా కి కానీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.. బాహుబలి తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండడం విశేషం..
ఇకపోతే కొంతమేర షూట్ జరుపుకున్న ఈ చిత్రంపై తాజా టాక్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ తన లాస్ట్ చిత్రం “తనాజీ” తరహాలోనే ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమాకు వినియోగించిన 3డి టెక్నాలిజీనే ఈ సినిమాకు కూడా వారు ప్లాన్ చేస్తున్నట్టు నయా టాక్. అలాగే ఈ సినిమాకు పెట్టే బడ్జెట్ ప్రకారం దానికన్నా బెటర్ ఎక్స్ పీరియన్స్ ఆదిపురుష్ వస్తుంది అని తెలుస్తుంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా మంచి అవుట్ పుట్ ఆదిపురుష్ ఉంటుందని తెలిసిందే. ఇక ఈ భారీ చిత్రంలో రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.