
వరుస ప్లాప్ లతో సతమవుతున్న ఆది సాయి కుమార్ మరోవైపు వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే అయన హీరోగా నటించిన శశి సినిమా ప్లాప్ కాగా ఆ తర్వాత కూడా మళ్ళీ రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు. తాజాగా అయన బ్లాక్ అనే ఓ క్రైమ్ థిల్లర్ సినిమా లో నటిస్తుండగా ఆ సినిమా కి సంబంధించి ట్రైలర్ విడుదల అయ్యింది ఈరోజు.

యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. విలన్ ఆటకట్టించడానికి హీరో చేసే ప్రయత్నం .. హీరో అంతుచూసే వ్యూహాలతో విలన్ మధ్య జరిగే వార్ తో ఈ కథ నడవనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ డేరింగ్ పోలీస్ ఆఫీసర్ గా, గతంలో కంటే మరింత ఫిట్ నెస్ తో కనిపిస్తున్నాడు.

మహంకాళి మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకు, జీబీ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో కథానాయికగా 'దర్శన' పరిచయమవుతోంది. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.