డిప్రెషన్ లో ఉన్న మహిళను నవ్వించిన ‘జాతిరత్నాలు’

మార్చ్ 11న థియేటర్లలో విడుదలైన చిత్రం ‘జాతి రత్నాలు’. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. ఈ చిత్రంపై ప్రశంసలు ఈ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ పెట్టిన కారణంగా అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఎంటర్టైన్ చేయడానికి ఓ.టి.టిలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిప్రెషన్ లోకి వెళ్ళిన ఒకావిడను ఈ సినిమా నవ్వించగలిగింది. ఈ విషయాన్ని సదరు మహిళ కుమారుడు ట్విటర్ ద్వారా తెలియజేసారు.

వివరాల్లోకి వెళితే కోవిడ్-19 కారణంగా ఒక కుటుంబం ఆ ఇంటి పెద్దను కోల్పోయింది. ఆయన మరణంతో వాళ్ళావిడ డిప్రెషన్ లోకి వెళ్ళింది. “మా అమ్మ చాలా రోజుల తర్వాత మీ సినిమా చూసి నవ్వింది. ఆమె చాలా రోజులుగా డిప్రెషన్ లో ఉంది ఆమెను నవ్వించి మాకు రిలీఫ్ ఇచ్చినందుకు థాంక్ యు సర్” అంటూ ట్విటర్ లో పోస్ట్ చేసి నవీన్ పొలిశెట్టిని ట్యాగ్ చేసాడు. దానికి స్పందించిన నవీన్ “ప్రియమైన వారిని కోల్పోవడం చాలా బాధాకరం అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ డిటైల్స్ ఇవ్వండి ఆమెను సర్ప్రైజ్ చేసేందుకు ట్రై చేస్తాను” అని ట్వీట్ చేసారు

ఇక ఆమెకు వీడియో కాల్ చేసి ఆవిడను సర్ప్రైజ్ చేసాడు నవీన్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ ఒక ఫోటోను పోస్ట్ చేసారు. “ఆవిడ మళ్ళీ నవ్వారు. అవసరాల్లో ఉన్నవారిని ఆదుకుందాం. ఒకరికొకరు సహాయంగా ఉంటూ ధైర్యంగా ఈ సమస్యను ఎదుర్కొందాం” అని ట్వీట్ చేసారు. నిజానికి పోయినేదాడే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా కరోన కారణంగా విడుదల కాలేదు. సినిమా తీసేటప్పుడు ఎంత కష్టపడ్డారో ప్రమోషన్స్ లో కూడా అంతే కష్టపడ్డారు. దాంతో సినిమా జనాల్లోకి వెళ్ళి సినిమాకి హైప్ వచ్చేలా చేసింది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.