Andhra Pradesh Government has named a music and dance school at Nellore after SP Balasubrahmanyam to honour the legendary singer. #SPB #SPBalasubrahmanyam pic.twitter.com/m7Wn9eaWpl
— BARaju (@baraju_SuperHit) November 27, 2020
గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు తన గాత్రంతో మనందరినీ ఎంత గానో అలరించారు. 35 వేల పై చిలుకు పాటలు పడిన ఎస్పీ బాలు గారు ప్రపంచం అంతా అభిమానులని సంపాదించుకున్నారు. ఈ మధ్య కరోన వలన ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఆయన గొప్పదనాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకొని నెల్లూరు లోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకి ఆయన పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆఫీష్యల్ గా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. అలాగే ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యం పేరుతో మైసూరు విశ్వ విద్యాలయంలో అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేయనున్నారు. గురువారం వర్సిటీలో వీ.సీ హేమంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సిండికేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ బాలు జీవిత సాధనలను, పాటలను భవిష్యత్ తరాలవారికి అందించేలా ఈ పీఠం నెలకొల్పుతున్నామని వీ.సీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు లోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు దివంగత దిగ్గజ గాయకుడు పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టటం పట్ల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఆనందంగా ఉన్నారు. తన తండ్రికి తక్కిన గొప్ప గౌరవమని, సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి, ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపారు. గాన గంధర్వుడికి ఇంత గొప్ప గౌరవం ఇవ్వడంపై ఆయన అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.