
వరసగా తెలుగులో చిన్న సినిమాలని ప్రోత్సహిస్తూ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో తనకి అంటూ ఒక పేరు తెచ్చుకున్న ఆహా ఓ.టి.టి లోకి మరో కొత్త సినిమా రాబోతుంది. అది గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్దు, సీరత్ కపూర్ కలిసి జంట గా నటిస్తున్న ‘మా వింత గాధ వినుమా’ చిత్రం. ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యనే విడుదలై సినిమా మీద అంచనాలు పెంచింది. ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తుంది. విడుదలకు ముందే ఈ సినిమా మీద మంచి పాజిటివ్ టాక్ నడుస్తుంది. అలాగే ఈ సినిమా టీం కూడా సినిమా ప్రమోషన్ బాగా చేస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్ లో భాగం గా ఈరోజు ఒక పాటని విడుదల చేశారు. ఈ పాటని ప్రముఖ సింగర్ చిన్మయి, దర్శకుడు రాహుల్ విడుదల చేశారు. "తనకి ఈ పాట చాలా నచ్చిందని, ఈ పాట విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని" చిన్మయి అన్నారు. "ఈ దూరం దగ్గరయేలా" అని మొదలైయే ఈ మెలోడీ పాట వినడానికి చాలా హాయిగా ఉంది. ఈ సినిమా కూడా అంచనాలని అందుకుటుందో లేదో తెలియాలి అంటే నవంబర్ 13 వరకు ఆగాలి. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా శ్రీచరన్ పాకాల చేస్తున్నారు. ఈ సినిమాకి ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్నారు.