ఐ.ఎ.ఎస్ అకాడమీలో సోను సూద్ పేరుతో ఒక డిపార్ట్మెంట్

Wish my mom was there to see this. Miss u more today maa 🙏

Posted by Sonu Sood on Wednesday, December 2, 2020

కరోన నుంచి జాగ్రత్త పడటానికి చేసిన లాక్డౌన్ తో దేశం అంత అతలాకుతలం అయింది. చాలా మంది జీవితాలని కరోన కష్టాల్లోకి నెట్టింది. అయితే ఇలాంటి సమయంలొనే కొంతమంది వ్యక్తుల వల్ల చాలా మందికి సహాయం అందింది. అలాంటి వాళ్లలో మనకి ముందుగా గుర్తొచ్చేది సోను సూద్ పేరు. ఆయన చాలా మంది వలస కూలీలను వాళ్ల ఇంటికి చేర్చారు. దాదాపు 20 వేల మంది వలస కార్మికులను సోను సూద్ తన సొంత ఖర్చుతో ట్రైన్స్, బస్సులు, ఫ్లైట్స్‌లో సొంతూళ్లకు పంపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడప్పుడే సోను సూద్ మంచితననికి  పేరు వస్తుంది. ఆయన గొప్పతనాన్ని అందరికి తెలిసేలా ఐఎఎస్ , ఐపిఎస్ ట్రైనింగ్ కి  దేశం అంత పెద్ద పేరు ఉన్న శరత్ చంద్ర ఐఎఎస్ అకాడమీ లో ఒక డిపార్ట్మెంట్ కి సోను సూద్ పేరు పెట్టారు. సోను సూద్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ పేరుతో ఒక కొత్త డిపార్ట్మెంట్ ని ఈ అకాడమీ ఓపెన్ చేసింది. ఈ విషయాన్ని సోను సూద్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకొని తన అమ్మ ఉంటే ఈ వార్తను చూసి చాలా సంతోషించేది అని ఆయన అన్నారు. నిన్ను చాలా మిస్ అవుతున్న అమ్మ అని ఆయన తన పోస్ట్ లో తెలిపారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.