తెలుగు టాకీ చిత్రానికి పునాది ‘భక్త ప్రహ్లాద’

అది 1931, మూకీ చిత్రాల నుండి హిందీ సినిమా టాకీ వైపు చూస్తోంది. భారత దేశంలో తోలి టాకీ సినిమా ‘ఆలమ్ ఆరా’ తెరకెక్కుతున్న సమయం. అప్పటికే ఎన్నో మూకీ చిత్రాలు చేసిన అర్దేషిర్ ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు. ఆయనకు అత్యంత సన్నిహితుడు, తెలుగు సినిమాకు వెన్నెముక లాంటి హెచ్.ఎమ్ రెడ్డి గారు ఆ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. ఆ చిత్రం చేస్తున్నపుడు ఆయనకు తెలుగులో కూడా టాకీ చేయాలనీ అనిపించింది. అనుకున్నదే తడవుగా రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రముఖ నాటక మండలి ‘సురభి’ నుండి నటీ నటులు, రచయిత ‘ఆంధ్ర నాటక పితామహ’ ధర్మవరం రామకృష్ణ చార్యులు గార్లను భక్త ప్రహ్లాద కోసం బాంబే తీసుకెళ్ళారు. కథ మొత్తం తయారయిన తర్వాత కొన్ని పద్యాలు, పాటలు రాయించాలని అనుకున్నారు. ప్రముఖ కవి చందాల కేశవ దాసు గారిచే పాటలు రాయించారు. తెలుగు సినిమాలో మొదటి పాట రూపుదిద్దుకుంది. రంగస్థల నటులు వల్లూరు సుబ్బయ్య, సురభి కమలబాయ్, మునిపల్లె సుబ్బయ్య ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అదీ ఇరాని, గోవర్ధన్ భాయ్ పటేల్ లు కెమేరా విభాగంలో పనిచేసారు. సంగీతం హెచ్.ఆర్ పద్మనాభ శాస్త్రి గారు అందించారు. ‘ఆలమ్ ఆరా’ సెట్స్ లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్ర దర్శకుడైన అర్దేషిర్ ఇరానీ గారే ఈ చిత్రానికి నిర్మాత. ఇంపీరియల్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శక దిగ్గజం ఎల్.వి ప్రసాద్, ప్రముఖ రంగస్థల నటుడు సి.ఎస్.ఆర్ దర్శకత్వ విభాగంలో పని చేసారు. ఈ చిత్రాన్ని 18,000 రూపాయలతో నిర్మించారు. మొదట 1931, సెప్టెంబర్ లో విడుదల చేయాలనుకున్నా కొన్ని కారణాల వల్ల చిత్రం వాయిదా పడి ఫిబ్రవరి 6న విడుదలైంది. కృష్ణ మూవీస్ వారు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసారు. అలా తెలుగు సినిమాలో నూతన అధ్యాయం మొదలై 89 సంవత్సరాలు పూర్తయింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.