బాలీవుడ్ నటి దీపికా పదుకొనే 'చెన్నై ఎక్స్‌ప్రెస్' ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో సంబరాలు జరుపుకుంటున్నారు. షారుఖ్ ఖాన్‌తో ఆమె నటించిన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల ఐకానిక్ అయ్యింది - రైలు సీక్వెన్స్, కార్ ఫైట్ మొదలైనవి. 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లో రోహిత్ శెట్టి డైరెక్షన్, షారుఖ్ ఖాన్-దీపికా పదుకొనే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యాయి.
షారుఖ్ ప్లాపుల్లో ఉన్నప్పుడు వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్ బాలీవుడ్ బాక్స్ ఆఫీసు దగ్గర దుమ్ము దులిపేసింది. ఓం శాంతి ఓం సినిమా తర్వాత షారుఖ్ దీపికా కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.
'లుంగీ డాన్స్' 'తంగబలి' లాంటివి సినిమా కి స్పెషల్ అయ్యాయి. లుంగీ డాన్స్ అయితే అప్పట్లో దేశం అంతా ఒక ఊపు ఊపింది. ప్రతీ పార్టీలో ఈ డాన్స్ ఐటమ్ ఉండాల్సిందే. 'టిట్లీ' నుండి 'కాశ్మీర్ తు మెయిన్ కన్యాకుమారి' వరకు సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి..
'చెన్నై ఎక్స్‌ప్రెస్' లో షారుఖ్ నుండి ఫాన్స్ కోరుకునే అన్ని అంశాలు సమానంగా ఉన్నాయి. కామెడి, రొమాన్స్, మ్యూజిక్ ఇలా అన్నింటితో సినిమా ఫుల్ ప్యాకేజీ లాగా ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీపికా పదుకొనే షారుఖ్, దర్శకుడు రోహిత్ శెట్టిలతో కలిసి ఉన్న ఫొటోస్ కిన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
